అవమానంతో యువకుడు.. ఏం చేశాడంటే? ఖమ్మంలోని రేగళ్లపాడులో అవమాన భారంతో పాషా అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని ఫోన్ తీసుకున్న మిత్రుడు.. ఓ మహిళకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆమె భర్త పాషాపై దాడి చేశాడు. దీంతో అవమానంగా భావించిన అతను పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. By Kusuma 07 Oct 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి చేయని తప్పుకు తనపై దాడి చేశారని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రేగళ్లపాడు గ్రామానికి చెందిన సయ్యద్ పాషా ఓ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతని స్నేహితుడు ధనేకుల ఖాసుబాబు వారం కిందట పాషా సెల్‌ఫోన్ నుంచి రేగళ్లపాడుకు చెందిన ఓ వివాహితకు కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ వివాహిత మహిళ భర్తకి ఈ విషయం తెలియడంతో పాషా షాప్ దగ్గరకు వచ్చి నిలదీశారు. ఇది కూడా చూడండి: Iran: ఇజ్రాయెల్ లో ఉద్రిక్త పరిస్థితులు..విమానాలు రద్దు చేసిన ఇరాన్! చేయని తప్పుకి.. స్నేహితుడు తప్పు చేశాడని, తాను అలాంటి పనిచేయలేదని, తనకి తెలియదని చెప్పిన వినకుండా తీవ్రంగా కొట్టారు. ఖాసుబాబు పరారీ కావడంతో పాషాపై వివాహిత భర్త దాడి చేశాడు. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించానని అవమానంగా భావించి పాషా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చూడండి: Israel:ఊచకోతకు ఏడాది.. 365 రోజుల వినాశనం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం #khammam #suicide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి