క్రైం Student Murder: తెలంగాణలో దారుణం.. డిగ్రీ విద్యార్థిని కొట్టి చంపిన ఇంటర్ స్టూడెంట్స్! భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో డిగ్రీ విద్యార్థిని ఇంటర్ స్టూడెంట్స్ కొట్టి చంపిన ఘటన సంచలనం రేపుతోంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అల్లూరి విష్ణును ఇరవై మంది ఇంటర్ స్టూడెంట్స్ మత్తులో ప్రైవేట్ పార్ట్స్ పై గుద్దడంతో అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: జలదిగ్బంధంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం.. మూడో ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం 53 అడుగుల వద్దకు నీరు చేరటంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 30 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. మరో 2 అడుగుల వరకు గోదావరి పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. By Vijaya Nimma 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadrachalam: భద్రాచలంలో మళ్లీ పెరిగిన వరద.. 2వ ప్రమాద హెచ్చరిక జారీ..! భద్రాచలం దగ్గర మళ్లీ వరద పెరిగింది. దీంతో అధికారులు తిరిగి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి 51 అడుగుల దగ్గర ప్రవహిస్తోంది. 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: దారుణం.. ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్తో బాలిక మృతి ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్తో అంజలి అనే 9 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది. ఛార్జింగ్ పెట్టే సమయంలో అంజలి చేతులు తడిగా ఉండటం వల్లే కరెంట్ షాక్ కొట్టి ఉండొచ్చని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: ఏసీబీ వలలో పాల్వంచ ఎస్ఐ.. లంచం తీసుకుంటుండగా..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము ఏసీబీ వలలో చిక్కాడు. ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. తన ఇంటి వద్ద రాము లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka: గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: భట్టి TG: బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. గత పదేళ్లలో ప్రభుత్వ అప్పు పది రెట్లు పెరిగిందని చెప్పారు. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 🔴 Telangana Budget LIVE: తెలంగాణ బడ్జెట్.. ఆ శాఖలకు భారీగా నిధులు! తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం 2,92,159 కోట్లు అని భట్టి వెల్లడించారు. అత్యధికంగా వ్యవసాయానికి రూ.72,659 కోట్లను కేటాయించారు. పంచాయతీ రాజ్ కు రూ.29,816 కోట్లు వెచ్చించారు. By Nikhil 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Badhrachalam: భద్రాచలం వద్ద మరోసారి పెరుగుతున్న గోదావరి! భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతుంది. రెండు రోజుల క్రితం 51.6 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం మంగళవారం తగ్గుముఖం పట్టింది. రాత్రి 45 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతూ 47.3 అడుగుల వద్దకు చేరింది. By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ జయరాజుకు ప్రముఖుల పరామర్శ అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ప్రజాకవి జయరాజును పలువురు నేతలు పరామర్శించారు. ఈ రోజు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn