/rtv/media/media_files/2025/02/25/iTSJbD98QqlvS2ewmoRV.jpg)
hyderabad forts Photograph: (hyderabad forts)
Hyderabad: భాగ్యనగరం మరోసారి తన ఘనత చాటుకుంది. భారత పురావస్తు శాఖ విడుదల చేసిన దేశంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో గోల్కొండ కోట (6), చార్మినార్ (10) చోటు దక్కించుకున్నాయి. తాజ్‌మహల్ అగ్రస్థానంలో నిలిచింది.
టాప్-10 ప్రదేశాల జాబితా..
ఈ మేరకు 2023-24లో దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్-10 ప్రదేశాల జాబితాను భారత పురావస్తు శాఖ (Archaeological Survey of India-ASI) రిలీజ్ చేసింది. హైదరాబాద్ నుంచి గోల్కొండ కోట 6వ స్థానంలో, చార్మినార్ 9వ స్థానంలో నిలిచాయి. ఆగ్రాలోని తాజ్‌మహల్ అగ్రస్థానంలో నిలవగా.. 61 లక్షల మంది దేశీయ సందర్శకులు వచ్చినట్లు తెలిపింది. కరోనా మహమ్మారి తర్వాత హైదరాబాద్ పర్యాటకం 30% వృద్ధిని కనబరిచినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: AP News: వ్యభిచారం వీడియోలు ఎందుకు బయటపెట్టారు.. పోలీసులపై వైసీపీ నేత ఆగ్రహం!
గోల్కొండ, చార్మినార్‌కు 28 లక్షల మంది..
2023-24లో గోల్కొండ, చార్మినార్‌ను 28 లక్షల మందికిపైగా దేశీయ పర్యాటకులు సందర్శించారు. గోల్కొండ కోటకు 2022-23లో 15.27 లక్షల మంది, 2023-24లో 16.08 లక్షల మంది సందర్శించారు. చార్మినార్‌ను 2022-23లో 9.29 లక్షల మంది, 2023-24లో ఏకంగా 12.90 లక్షల మంది సందర్శకులు వచ్చారు. గోల్కొండకు ఈ యేడాది 80 వేల మంది ఎక్కువగా వచ్చారు. చార్మినార్‌కు 3.60 లక్షల మంది ఎక్కువగా సందర్శించారు. హైదరాబాద్ నగరానికి పురాతన చరిత్ర ఉండటంతోపాటు.. రుచికరమైన ఆహారం, మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే ఇందుకు ప్రధాన కారణాలుగా భారత పురావస్తు శాఖ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Punjab: పంజాబ్‌లో త్వరలో ఆప్ ప్రభుత్వం కూలిపోతుంది: కాంగ్రెస్ నేత