తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గతకొద్ది రోజులుగా నిప్పులు కురిపిస్తున్న సూర్యూడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. మధ్యాహ్నం వరకూ నిప్పుల వానలు పడుతూంటే...ఉన్నట్టుండి నిప్పులు కాస్త వడగండ్లలా మారాయి. వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వండగండ్లు కూడా పడ్డాయి.
Also Read: IPL 2025: నేటి నుంచే ఐపీఎల్.. నాలుగు కొత్త రూల్స్ తో..
ముఖ్యంగా.. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోనే ఈ అకాల వర్షాలు కురవటం గమనార్హం. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్లు పడ్డాయి.మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ధర్మపురి మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది నేరేళ్ల, తుమ్మేనాల, ధర్మపురి, తిమ్మాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.
Also Read: BSNL: కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోనూ భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వాతావరణ శాఖ, వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే వడగండ్ల వాన కురిసింది. అయితే.. ఈ వర్షంతో సామాన్యులకు ఎండ నుంచి, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం దొరికినప్పటికీ.. రైతులకు మాత్రం తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది.
చాలా ప్రాంతాల్లో పంటలు చివరి దశలో ఉండగా.. ఉన్నట్టుండి ఈ వడగండ్లు కురవటం వల్ల చేతికొచ్చే పంట నేలపాలయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు.. ఈ అకాల వర్షాలతో కోతకొచ్చిన మామిడి తోటలు, పిందె దశలో ఉన్న మామిడి తోటలు తీవ్ర స్థాయిలో దెబ్బతినే అవకాశాలున్నాయి. మరి ఈ వడగండ్లతో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి నష్టం వాటిల్లిందన్నది తెలియాల్సి ఉంది.
రానున్న 2 రోజుల్లో...
ఇదిలా ఉంటే.. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న 2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వడగండ్ల వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్లు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావారణ శాఖ అధికారులు.
Also Read: IPL 2025: కోలకత్తాకు అరెంజ్ అలెర్ట్..ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరుగుతుందా?
Also Read: Breaking News: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ స్పాట్ డెడ్!
telangana | hyderabad | rains | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates