/rtv/media/media_files/2025/03/04/1hGL7M7swYvhsUPsFEHf.jpg)
Viral social media Post
ఇండియాలో రూల్స్ పాటించేవారు ఎంత మంది ఉంటారో..వాటివైపు కూడా చూడని వాళ్ళు అంతకంటే ఎక్కువే ఉంటారు. యాక్సిడెంట్లు అవుతున్నా చలాన్లు విధిస్తున్న తమ దారి తమదే అన్నట్టు ప్రవర్తిస్తారు చాలామంది వాహనదారులు. ముఖ్యంగా బైక్ ఓనర్లు అడ్డదిడ్డంగా నడపడమే కాకుండా...హెల్మెట్లు పెట్టుకోరు. తాత్కాలికంగా వచ్చే ఆనందం కోసం జీవితాలను పణం పెడుతుంటారు. అలాంటి ఓ నిర్లక్ష్యపు బైక్ ఓనర్ కు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పింది హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ విభాగం. తన బైక్ కు నంబర్ లేకుండా తిరుగుతున్నాను అని ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ కు నీ పాపం కూడా ఎప్పుడో అప్పుడు పండుతుంది అంటూ రిప్లై ఇచ్చారు.
ఎప్పటికైనా శిక్ష తప్పదు..
రూల్స్ ను పట్టించుకోకుండా తిరిగేవాళ్ళ తప్పించుకోవాలని చూడకండి..తాత్కాలిక ఆనందాలను అలవాటు పడితే కటకటాలు తప్పువు అంటూ హెచ్చరిస్తున్నారు ఎస్ ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు. ఇంతకు ముందులా ఇప్పుడు తాము లేమని...తరుచుగా వాహనాల తనిఖీలు చేస్తున్నామని...శిక్షలు కూడా వేస్తున్నామని చెబుతున్నారు. దీనికి సంబంధించి పోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా..ఓ వ్యక్తి తన బండికి నంబర్ ప్లేట్ లేదని..తననెవరూ పట్టుకోలేదని కామెంట్ పెట్టాడు. అతనికి రిప్లై ఇస్తే నీపాపం పండే రోజు దగ్గరలోనే ఉందంటూ రిప్తై ఇచ్చారు ట్రాఫిక్ పోలీస్. ఈ పోస్ట్ ప్పుడు వైరల్ అవుతోంది.
తాత్కాలిక ఆనందానికి అలవాటు పడితే కటకటాలు తప్పవు.
— 𝗦𝗥 𝗡𝗮𝗴𝗮𝗿 𝗧𝗿𝗮𝗳𝗳𝗶𝗰 𝗣𝗦 (@shotr_srnagar) March 4, 2025
తప్పించుకోని తీరగాలని చూస్తే @HYDTP వదలదు .తరచూ తనిఖీలు చేస్తూ,ఇలాంటి ఉల్లంఘన దారులను గుర్తించి అట్టి వాహనాలను జప్తు చేయడం జరుగుతుంది.
Avoid Number plate voilations( covering ,tampering,irreguler or improper ). pic.twitter.com/DBxT3Y5eRk
Also Read: champions Trophy: సిక్స్ తో విజయతీరాలకు..రాహుల్ విన్నింగ్ షాట్ ఇదే..