/rtv/media/media_files/2025/03/14/MLIofIGEVlZ0cSAE8i2q.jpg)
Hyderabad Holi event organizers fraud people
Holi: భాగ్యనగరంలో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నాపెద్దా అంతా కలిసి రంగులద్దుకుని సందడి చేస్తున్నారు. సిటీ రోడ్లు అన్నీ రంగులమయం అయ్యాయి. అయితే ఈ సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. హోటల్స్, పబ్, రిసార్టుల్లో పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ఈవెంట్ నిర్వాహకులు సినీ తారలు రాబోతున్నారంటూ హంగామా చేశారు. కస్టమర్లను ఆకర్షించేలా హోర్డింగ్ ఏర్పాటు చేసి టికెట్లు విక్రయించారు. భారీగా డబ్బులు వసూల్ చేసి చేతులెత్తయడంతో జనాలంతా లబోదిబోమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ మాదాపూర్ లో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి.
హోలీ నేషన్ పేరిట ఈవెంట్..
ఈ మేరకు మాదాపూర్‌లోని 'మ్యాన్ మేడ్ హిల్స్'లో హోలీ నేషన్ పేరిట ఈవెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేశారు. హీరోయిన్ కాజల్ వస్తుందంటూ భారీ ధరకు టికెట్లు విక్రయించారు. దీంతో జనం ఎగబడి టికెట్లు కొన్నారు. కానీ చివరకు ఊహించని షాక్ తగిలింది. కాజల్ కాదు కదా కనీసం యూట్యూబ్ స్టార్ కత్తర్ పాప కూడా రాలేదు. ఈవెంట్ కు వచ్చిన వారంతా ఆందోళనకు దిగారు. ఆర్గనైజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ఈ రోజు నుంచి అల్పాహారంలో ఇవి ట్రై చేయండి.. బరువు ఇట్టే తగ్గిపోతారు
ఈ ఈవెంట్ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్లాన్ చేయగా పోలీసులు మధ్యానం 1 వరకే పర్మిషన్ ఇచ్చారు. అంతేకాదు స్వయంగా ఈవెంట్ జరుగుతుంటే అక్కడికి వచ్చి జనాలను బయటకు పంపించారు. దీంతో వేలకు వేలు పెట్టి టికెట్లు కొని మోసపోయామని లబోదిబోమంటున్న జనం.. డీజేలు కూడా సరిగ్గా పనిచేయలేదని అందరినీ నట్టేటా ముంచేశారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఇష్యూ హైదరాబాద్ నగరంలో చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: ఈ మూడు స్మూతీలతో నెల రోజుల్లో బరువు తగ్గొచ్చు