/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sucide-jpg.webp)
Eighth Class student deid
ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా సున్నితంగా తయారవుతున్నారు. తల్లిదండ్రులు దెబ్బలాడారని..టీచర్లు తిట్టారని ఆవేశంలో ఏమేమో చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలనే తీసుకుంటున్నారు. దీనికి తతల్లిందడ్రులు కూడా ఒకరకంగా కారణమవుతున్నారు. చిన్నప్పటి నుంచీ పిల్లలను అమ్మా...బాబూ అని పెంచుతున్నారు. చిన్న దెబ్బ తగిలినా ఏదో అయిపోయినట్టు రియాకట్ అవుతున్నారు. తమ పిల్లలను తామూ ఏమీ అనడం లేదు..ఎవరైనా, ఏమైనా అంటే ఊరుకోవడం లేదు కూడా. ఈ పెంపకం వల్లనే పిల్లలు జీవితం ఎంత విలువైనదో తెలుసుకోలేకపోతున్నారు. దీనివలన చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం కలవరపెడుతోంది.
Also Read: TS: మోకాళ్ల లోతు మట్టి, బురద..కష్టతరం అవుతున్న కార్మికుల రెస్క్యూ
టీచర్లు తిట్టారని..
తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్న సంగారెడ్డి అనే బాలుడు స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చదువుతున్న స్కూల్లో...తన క్లాసులో సంగారెడ్డి సీసీటీవీ డైరెక్షన్ ను మార్చాడని..పీఈటీ టీచర్ అతనిని కొట్టాడు. అతనితో పాటూ మరో టీచర్ కూడా బాలుడిని తిట్టింది. దీంతో సంగారెడ్డి మనస్తాపానికి గురైయ్యాడు. వెంటనే సారీ మదర్..ఐ విల్ డై టుడే అని రాసి స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకేశాడు. బాలుడు కిందపడిపోవడాన్ని గమనించిన స్కూలు సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడకు వెళ్ళే లోపునే సంగారెడ్డి మరణించాడు.
Also Read: TS: తెలంగాణలో మరో ఎనిమిది మంది ఐపీఎస్ లు బదిలీ