/rtv/media/media_files/2025/02/18/y2sxSr8YrtB92zss3HmU.jpg)
Hydra commissioner Ranganath
హైదరాబాద్ (Hyderabad) శివార్లలో ప్రభుత్వ అనుమతి ఉందని చెబుతూ ఫామ్ ల్యాండ్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని హైడ్రా (Hydra) కమిషనర్ రంగనాథ్ చెప్పారు. దీనిపై ఆయన కీలక ప్రకటన చేశారు. అనధికారిక లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురికావొద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఇలాంటి భూముల మీద ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయని ఆయన వివరించారు. రాజేంద్రనగర్ మండలం, లక్ష్మిగూడలోని 50వ సర్వే నంబరులోని ఎకరం రెండు గుంటల భూమిని ఫామ్‌ల్యాండ్ పేరుతో ప్లాట్లుగా అమ్ముతున్నారని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారని తెలిపారు.
Also Read: Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు
Also Read : ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు.. 20 రాష్ట్రాల CMలు, 50 మంది సెలబ్రెటీలు
ప్రభుత్వ అనుమతుల్లేవు..
ప్లాట్లు అమ్మాలన్నా, లే అవుట్లు ఏర్పాటు చేయాలన్నా రూల్ ప్రకారం ప్రభుత్వ అనుమతి ఉండాలి. అలా అనుమతించి వాటిని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని తప్పించుకునేందుకు చాలా మంది వాటిని వ్యవసాయ భూములుగా మార్చి ప్లాట్లుగా అమ్మేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ (Ranganath) తెలిపారు. అలా అమ్మాలంటే గజాల్లో కాకుండా కనీసం అర్ధ ఎకరా భూమిని విక్రయించాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలని 2018లోనే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయినా కొందరు అధికారులు వీటిని పట్టించుకోవట్లేదు. అలాంటి వారిపై, సంస్థలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. జీవో నంబరు 131 ప్రకారం ఆగస్టు 31, 2020 తర్వాత అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా మంజూరు చేయలేదని రంగనాథ్ స్పష్టం చేశారు. అలా అనుమతి లేకుండా కట్టిన కట్టడాలను కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ ప్రజలకు సూచన చేశారు.
Also Read: Kerala: హమాస్ నేతల ఫోటోలతో కేరళలో ఏనుగులతో ఊరేగింపు
Also Read : బాలరాముడికి భారీగా విరాళాలు.. అయోధ్య రామమందిరం ఆదాయం దేశంలోనే