/rtv/media/media_files/2025/02/13/EPhccD7K0ytVmk6PEZ4t.jpg)
himayath nagar ch0ri Photograph: (himayath nagar ch0ri)
Gold Robbery: నమ్మి ఇంటి తాళాలు చేతికిస్తే యజమానిని నట్టేట ముంచారు ఇంట్లో పనిమనుషులు. హైదరాబాద్(Hyderabad)లోని హిమాయత్ నగర్(Himayatnagar)లో గోల్డ్ షాప్ ఓనర్(Gold Shop Owner) ఇంట్లో చోరీకి పనివాళ్లే స్కెచ్ వేశారు. కూతురి పెళ్లి వేడుకల కోసం దుభాయ్ వెళ్లాడు. అదే అదునుగా భావించిన పని వాళ్లు ఇంట్లో లాకర్ రూల్స్ పగలగొట్టి బంగారం, వజ్రాలు, నగదు దోచుకెళ్లారు. మొత్తం రూ.2 కోట్ల 50 లక్షల విలువైన నగలు, డబ్బు చోరీకి గురైంది. వ్యాపారి లబోదిబోమంటూ హిమాయత్ నగర్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలలం రేపింది.
ఇది కూడా చదవండి: MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!
వివరాల ప్రకారం..
హిమాయత్ నగర్‌లో నివాసం ఉండే బంగారం వ్యాపారి రోహిత్ కేడియా కూతురి పెళ్లి దుబాయ్‌లో జరిగింది. కూతురు పెళ్లి కోసం 4 రోజుల క్రితం వ్యాపారి రోహిత్ దుబాయ్‌కు వెళ్లాడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.2 కోట్ల రూపాయల నగలతో పాటు రూ.50 లక్షల నగదు చోరీకి గురైంది. వ్యాపారి వెంటనే హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. నారాయణగూడ పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.
వ్యాపారి రోహిత్ కేడియా దుబాయ్‌కు వెళ్లే ముందు ఇంట్లో పని చేసే 20 మందికి ఓ రూమ్ ఇచ్చాడు. ఈ నెల 11 అర్ధరాత్రి వ్యాపారి ఇంట్లో పని చేసే బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఇంకొకరి సహాయంతో 3 రూమ్‌ల లాక్స్ బ్రేక్ చేశాడు. ఇంట్లో ఉన్న రూ.50 లక్షల నగదు సహా 2 కోట్లు విలువ చేసే డైమండ్స్, గోల్డ్ ఎత్తుకెళ్లారు.
ఇది కూడా చదవండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్