/rtv/media/media_files/2025/04/03/o9YPI9bcHMLGDV4Bi5j3.jpg)
Heavy rains in Hyderabad
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే రోడ్లపై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు.
Also Read: మంత్రి పదవి ఊస్ట్?.. సోనియా, ఖర్గేతో కొండా సురేఖ కీలక భేటీ!
విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసి వాహనాదారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని ఆదేశించారు.
Sudden showers caught commuters unawares in Hyderabad on Thursday. Heavy rains lashed the city reducing the visibility while bikers took shelter under the flyovers.
— Deccan Chronicle (@DeccanChronicle) April 3, 2025
(Video Courtesy : Reshmi AR, Deccan Chronicle)#Hyderabad #Rain pic.twitter.com/sU0ZJIrISj
Also Read: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’
తెలంగాణలో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
#indtoday | Current situation in #BanjaraHills Road No. 10 Street, Hyderabad, India#HyderabadRains #hyderabad #hyderabadnews #rains #rainsnews #heavyrains #rainsinhyderabad pic.twitter.com/WdAXbb01QJ
— indtoday (@ind2day) April 3, 2025
telugu-news | rtv-news | heavy-rains | cm revanth