Cyber Crime: హైదరాబాద్‌లో 52 మంది సైబర్ నేరగాళ్లు అరెస్టు.. బ్యాంకు మేనేజర్ సహా..!

డిజిటల్‌ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు మేనేజర్‌ సహా 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీవీ ఆనంద్‌ తెలిపారు. వారి నుంచి చెక్‌బుక్‌లు, సెల్‌ఫోన్లు, రబ్బర్‌ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

New Update
Hyderabad police arrested 52 persons including 3 senior bank officials in cybercrime cases

Hyderabad police arrested 52 persons including 3 senior bank officials in cybercrime cases

Cyber Crime: దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులనే టార్గెట్‌ చేసి కొన్ని సైబర్ ముఠాలు డబ్బులు దోచేస్తున్నాయి. మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపించడం, వాట్సాప్ గ్రూప్‌లలో చేర్పించి డిజిటల్ ట్రేడింగ్ అంటూ నమ్మించడం చేస్తున్నారు. పలు యాప్‌లు డౌన్‌లోడ్ చేయించి అనంతరం వారితో పెట్టుబడి పెట్టించి లాభాలు వచ్చినట్లు చూపిస్తున్నారు. కోట్లలో లాభాలు చూపించి నమ్మిస్తున్నారు. ఆపై డబ్బులు విత్‌డ్రా చేసుకునే క్రమంలో అవి రాకపోవడంతో బాధితులు తాము మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడంతా ఇదే వ్యవహారం జోరుగా నడుస్తోంది. 

Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!

52 మంది అరెస్ట్

అయితే ఇలా డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో బ్యాంకు మేనేజర్ సహా కొంతమంది బ్యాంకు ఉద్యోగులను కలుపుకుని మొత్తం 52 మందిని అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు. 

Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

మూడు రకాల సైబర్ క్రైమ్స్

పట్టుబడ్డ నిందితుల నుంచి సెల్‌ఫోన్లు, చెక్ బుక్‌లు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, రబ్బర్ స్టాంపులు, అధిక మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా నిందితులు మూడు రకాల సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. అంతేకాకుండా ఈ స్కామ్‌లో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు సైతం ఉన్నారని చెప్పారు. 

Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!

సైబర్ నేరగాళ్లు బాధితున్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ.93 లక్షలు దోచేశారని తెలిపారు. అంతేకాకుండా మ్యూల్ అకౌంట్‌ను బ్యాంకు అధికారుల సహకారంతో తెరిపించి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం అని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు తమకు తెలియని వాట్సాప్ గ్రూప్‌లలో జాయిన్ కావద్దని సూచించారు. ఈ మేరకు ఇలాంటి ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు