Hyderabad Cyber Crime: హైదరాబాద్‌ వాసికి సైబర్‌ వల.. రూ.4.31 కోట్లకు టోకరా!

హైదరాబాద్‌లోని యాప్రాల్‌కు చెందిన 49 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డాడు. షేర్ ట్రేడింగ్ పేరుతో పలు దఫాలుగా రూ.4.31 కోట్లు ట్రాన్సఫర్ చేశాడు. అనంతరం సొమ్మును విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

New Update
Hyderabad Man loses Rs.4.31 crore in trading scam (1)

Hyderabad Man loses Rs.4.31 crore in trading scam

Hyderabad Cyber Crime: రోజు రోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. లింక్ క్లిక్ చేయగానే డబ్బులు దోచేస్తున్నారు. అంతేకాకుండా ఫేక్ యాప్‌లు క్రియేట్ చేసి షేర్ ట్రేడింగ్ అంటూ కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటిపై పోలీసులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కడికక్కడే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి హైదరాబాద్ వాసి దాదాపు రూ.4.31 కోట్లు పోగొట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read :  భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

సైబర్ ఉచ్చులో హైదరాబాద్ వాసి

హైదరాబాద్‌లోని యాప్రాల్‌కు చెందిన 49 ఏళ్ల ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డాడు. నవంబర్ 29న తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ ట్రేడింగ్ పేరుతో ఉన్న లింక్‌ను క్లిక్ చేశాడు. వెంటనే  సైబర్ కేటుగాళ్లు ప్రముఖ కంపెనీ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో అతడ్ని చేర్చారు. 

Also Read :  నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

అక్కడ నుంచి ఆ వ్యక్తికి ఫోన్‌ కాల్స్ వచ్చాయి. ఆ సంస్థ ఉద్యోగి దివ్యాన్షి అగర్వాల్‌నంటూ ఓ యువతి బాధితుడికి ఫోన్ చేసింది. ఆ తర్వాత కొన్ని సూచనలు, సలహాలు చెప్పి అతడ్ని మెల్ల మెల్లగా నమ్మించింది. అనంతరం అశోక్ రెడ్డి పేరుతో మరో వ్యక్తిని బాధితుడికి పరిచయం చేసింది. అక్కడ నుంచి ఆ వ్యక్తి కథను నడిపించాడు.

ప్లేస్టోర్ ద్వారా పలు యాప్‌లను డౌన్‌లోడ్ చేయించాడు. అంతేకాకుండా డిసెంబర్ 13న బాధితుడి పేరుతో యూకో బ్యాంక్‌లో ఒక అకౌంట్‌ను ఓపెన్ చేయించారు. ఆపై వరుసగా డబ్బులు ట్రాన్సఫర్ చేయించుకున్నారు. మొదట రూ.50 వేలు, ఆ తర్వాత రూ.లక్ష, దాని తర్వాత మరో రూ.2 లక్షలు బదిలీ చేయించారు. అలా ఆ డబ్బులతో షేర్లు కొన్నట్లు యాప్‌లో చూపించారు. ఇలా జనవరి 3వ తేదీ వరకు మొత్తం రూ.1.84 కోట్లు ఆ అకౌంట్‌లోకి ట్రాన్సఫర్ చేయించి వాటితో షేర్ ట్రేడింగ్ చేసినట్లు నమ్మించారు.  

Also Read :  ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!

మొత్తంగా పెట్టుబడి, లాభాలు కలిపి ఏకంగా రూ.4.45 కోట్లు ఉన్నట్లు యాప్‌లో చూపించారు. దీంతో బాధితుడు సంబరపడిపోయాడు. అయితే రూ.7.65 కోట్లతో ఐపీఓ సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలంటూ సైబర్ కేటుగాళ్లు సూచించారు. దీంతో తన అకౌంట్‌లో రూ.4.45 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. 

మిగిలిన రూ.3.20 కోట్లలో కేవలం రూ.1.92 కోట్లు మాత్రమే చెల్లించాలని.. మిగతా 40 శాతం డబ్బును తమ సంస్థ కొంటుందని నమ్మించారు. దీంతో బాధితుడు రూ.2.47 కోట్లు పలు దఫాలుగా ట్రాన్సఫర్ చేశాడు. అనంతరం యాప్‌లో ఉన్న డబ్బును విత్ డ్రా చేయించుకునేందుకు ప్రయత్నించగా.. అవి రాలేదు. వెంటనే అనుమానం రావడంతో ముంబైలోని ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లి అడిగాడు. 

వారు ఇచ్చిన సమాధానంతో బాధితుడు కంగుతిన్నాడు. తమ సంస్థ పేరుతో నకిలీ యాప్ ద్వారా ట్రేడింగ్ చేశారని సంస్థ యాజమాన్యం తెలిపింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో‌కి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు