సినిమా రేంజ్లో స్మగ్లింగ్.. కడుపులో రూ.15 కోట్ల కొకైన్
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 67 గుళికల కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియా నుంచి ఇండియాకు ఓ యువకుడు కడుపులో అక్రమంగా కొకైన్‌ను తరలిస్తున్న యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ కొకైన్ విలువ దాదాపుగా 14.94 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.