/rtv/media/media_files/2025/03/24/Hykok2kv4qzuZIEoqnit.jpg)
Telangana High Court
ఇటీవల తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీని మూల్యాంకనం సిరిగ్గా చేయలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే పలవురు అభ్యర్థులు దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పరీక్ష పేపర్లను మళ్లీ రీవాల్యుయేషన్ చేయించాలని కోరారు. '' గ్రూప్ 1లో 18 రకాల సబ్జెక్టులున్నాయి. కానీ 12 మంది సబ్జెక్ నిపుణులతో పేపర్లు దిద్దించారు.
Also Read: కేబినెట్ విస్తరణ !.. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
మూడు భాషల్లో పరీక్షలు జరిగాయి. కానీ తగిన నిపుణులతో పేపర్లు దిద్దించలేదు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వాళ్లతో తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం పేపర్లు కూడా దిద్దించారు. ఇలా చేయడం వల్ల మూల్యాంకనంలో నాణ్యత లేకుండా పోయింది. దీంతో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని'' పిటిషనర్లు తెలిపారు.
Also Read: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ
Group-1 Revaluation Of Exam Papers
పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)కి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోనే కౌంట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
Also Read: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్!
ఇదిలాఉండగా రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్1 మెయిన్ ఎగ్జామ్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 31,403 మందిని ఎంపిక చేయగా.. 21,093 మంది మాత్రమే హాజరయ్యారు. ఇంగ్లీష్తో పాటు మరో ఆరు సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరిగాయి. ఇటీవలే పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి.
Also Read: వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అపర కుభేరుడు.. లగ్జరీ నౌకలో పెళ్లి!
rtv-news | group-1 | high-court | telangana-high-court | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates