Software Employees : సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..వరుసగా మూడు రోజులు...

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రం ఒక మంచి శుభవార్త ఉండబోతోంది. అదేంటో తెలుసుకుందాం.

New Update
Software Employees

Software Employees

Software Employees : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు ఎండ తీవ్రతతో పాటు వడగాలులు సైతం వీస్తున్నాయి.ఈ ఎండలతో స్కూల్స్‌కు వెళ్లే విద్యార్థులు, ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రం ఒక మంచి శుభవార్త ఉండబోతోంది.

ఇది కూడా చదవండి: వేసవికాలంలో మామిడికాయను ఈ సమయంలో తినండి

ఈ నెల 14న హోలీ పండుగ శుక్రవారం వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు.. స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత రోజు అంటే.. 15న శనివారం, 16వ తేదీన ఆదివారం రావడంతో.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఈ విధంగా వీక్ ఆఫ్స్ తో పాటు.. వరుసగా మూడు రోజుల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సెలవులు వచ్చాయి. దీంతో వారు తమ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి విహార ప్రయాణాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడికాలంలో శరీరానికి అవసరమైన విశ్రాంతిని తీసుకోవడానికి ఈ సెలవులు ఉపకరించనున్నాయి.

   Also read: Pranay murder case: ప్రణయ్ హత్యకేసులో అమృత చెల్లి ఆవేదన.. ‘అంతా అమృతే చేసింది’


ఇదే కాక.. కొంత మంది ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు డే టైంలో పనిచేస్తుంటారు. వారికి ఈ సెలవులు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇక కొన్ని కార్పొరేట్ పాఠశాలలోని హోలీ పండగ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. హోలీ పండుగ శుక్రవారం రావడం..తెల్లారితే శనివారం..తర్వాత రోజు ఆదివారం కావడంతో.. వరుస సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక వీటితో పాటు.. మార్చి నెలలోనే ఉగాది, రంజాన్ వంటి పండుగలు వరుసగా వచ్చాయి. ఈ రెండు రోజులు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు రానున్నాయి. అటు ఉద్యోగులకు కూడా ఈ రెండు రోజులు సెలవు ఉంటుంది. పాఠశాలలకు కూడా ఈ నెలలో సెలవులే సెలవులు.

Also read: Vijayanagaram: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు