/rtv/media/media_files/2026/03/05/fotojet-11-2026-03-05-08-43-03.jpg)
Ration Supply
Ration Supply : రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం(central-government) రాష్ర్ట ప్రభుత్వాలకు కీలక లేఖలు రాసింది. ఏప్రిల్ నెలలో 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించడానికి అవసరమైన సాధ్యసాధ్యాలను పరిశీలించాలని లేఖలో కోరింది.రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతున్న వేళ.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని.. ఏప్రిల్ నెలలోనే అందించేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ అధికారులు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం.. బియ్యం పంపిణీకి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. మార్చి మొదటి వారంలోనే ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో రానున్న రోజుల్లో భారీగా ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.
Also Read : ఏప్రీల్ 24న జాగృతి కీలక సమావేశం... పార్టీ ఆనౌన్స్ చేసే అవకాశం
Good News For Ration Card Holders
కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుదారులకు(ration-card-holders) సన్న బియ్యం పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఒక్కో లబ్దిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ప్రతీ నెల తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. అంటే ఒకరికి 18 కిలోల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఒకేసారి 3 నెలలకు సరిపడా బియ్యం కోటాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం.ఆదేశించడంతో ఆ మేరకు రాష్ట్రంలో సరిపడా సన్నబియ్యం నిల్వలు ఉన్నాయా..లేవా? మూడు నెలల బియ్యాన్ని సరఫరా చేయడం సాధ్యమేనా అనే అంశాన్ని తెలంగాణ సర్కార్ పరిశీలిస్తోంది.
గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 3 నెలల రేషన్(ration-shops) ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. గతేడాది వర్షాకాలంలో ఒకే నెలలో మూడు నెలల బియ్యం(rice) కోటాను పంపిణీ చేసింది. అయితే ఆ సమయంలో అటు లబ్ధిదారులతోపాటు.. రేషన్ డీలర్లకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకేసారి మూడు నెలల సరుకును నిల్వచేయడం రేషన్ డీలర్లకు సాధ్యమయ్యే పని కాదు. అలాగే మూడునెలలకు సంబంధించి లబ్ధిదారుడు ఒకేసారి మూడు వెలిముద్రలు వేయాల్సి ఉంటుంది. దీనికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. అలాగే బియ్యం జోకడానికి కూడా సమయం పడుతుంది. ఈ సమస్యలు పరిష్కారమైతే మూడు నెలల రేషన్ ఇవ్వడం పెద్దగా సమస్య కాదు. అంతేకాదు3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం వల్ల రవాణా ఛార్జీలు ఖర్చు తగ్గనుంది. అంతేకాకుండా డీలర్లు, హమాలీ కూలీ కూడా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు కోటి మందికి పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా. దీంతో ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేయడం పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటికి ముందుగానే పరిష్కారాలు కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కేంద్రం సూచనల మేరకు రాష్ట్రంలో మూడు నెలల రేషన్ సరఫరా అమలు చేసే విషయంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి
Also Read : మావోయిస్టు దళపతి గణపతి లొంగుబాటు ?
Follow Us