/rtv/media/media_files/2025/02/11/uAsV03MEdVunhfwnqpkK.jpg)
bird flu telangana
Bird Flu in Telangana: తెలంగాణలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్(Choutuppal, Yadadri District) మండలం నేలపట్లలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయినట్లు జిల్లా పశు వైద్యాధికారి(Veterinary Officer) జానయ్య వెల్లడించారు. వారం రోజుల క్రితం స్థానిక కోళ్ల ఫామ్(Chicken Farm)లలో వెయ్యి కోళ్లు మృతి చెందాయని, వాటి నమునాలను ల్యాబ్‌కు పంపగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. అయితే ప్రజలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Also Read: సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్.. పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ!
బర్డ్ ఫ్లూ నమోదైన నేలపట్ల ప్రాంతం పరిధిలో పది కిలోమీటర్ల వరకు సర్వలేన్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. కిలోమీటర్ పరిధిలోని మొత్తం ఐదు కోళ్ల ఫామ్స్ ఉన్నాయి. వాటి వాటి శాంపిల్స్‌ను కూడా హైదరాబాద్‌కు పంపించారు. ఇక నేలపట్ల గ్రామంలో మొదటి కేసు నిర్ధారణ కావడంతో అక్కడ పోలిస్ పికెటింగ్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
Also Read: భక్తులకు గుడ్‌న్యూస్.. మహాశివరాత్రికి 3 వేల స్పెషల్ బస్సులు.. ఫుల్ లిస్ట్ ఇదే!
ఏకంగా ఏడువేల కోళ్లు మృతి..
ఇదిలాఉండగా ఇటీవలే నల్గొండ జిల్లాలో కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో పలు కోళ్ల ఫామ్‌లలో ఏకంగా ఏడువేల కోళ్లు మృతి చెందాయి. ఇవి బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రమాదం జరగకముందు హైదరాబాద్ నుంచి వచ్చిన జోనల్ డాక్టర్లు పలుమార్లు వైద్యం అందించినా కూడా ఫలితం లేకుండా పోయిందని పౌల్ట్రీ రైతు అన్నారు. దాదాపు 3 లక్షల నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్!