VC Sajjanar : ఆ యాప్‌ల మాయలో పడకండి...అదిసైబర్‌ కేటుగాళ్ల ఉచ్చు...ఎక్స్‌ లో కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సంచలన పోస్టు

అనేక కారణాల మూలంగా యువత ఒంటరితనంతో మొబైల్‌ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. అందులో ఉండే వివిధ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని గుర్తు తెలియని యువతీ,యువకులతో సంభాషిస్తూ సంతృప్తి పడుతున్నారు. అయితే  ఆ సంతృప్తి వెనుక సైబర్‌ మోసం దాగి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

New Update
FotoJet (3)

Commissioner VC Sajjanar

 VC Sajjanar : అనేక కారణాల మూలంగా యువత ఒంటరితనానికి అలవాటు పడుతున్నారు. దాని నుంచి బయటపడడానికి మొబైల్‌ ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. అందులో ఉండే వివిధ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని గుర్తు తెలియని యువతీ,యువకులతో సంభాషిస్తూ సంతృప్తి పడుతున్నారు. అయితే  ఆ సంతృప్తి వెనుక సైబర్‌ మోసం దాగి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఈ విషయంలో ఎప్పటికపుడు హెచ్చరిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన యాప్‌ల విషయమై  ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టారు.

 ‘‘ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు’’ అంటూ ఇటీవల ఎక్కవగా వస్తున్న ఒక యాడ్‌ గురించి ఆయన ఎక్స్‌ లో ప్రస్తావించారు. యువతను ఆకర్షించే విధంగా సోషల్ మీడియాలో వస్తోన్న ఇలాంటి యాడ్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ యాడ్స్‌ వెనుక ఉన్నది తీయని మాటలు కాదని. నిలువునా దోపిడీ చేసే సైబర్‌ కేటుగాళ్ల ఉచ్చు అని సజ్జనార్‌ హెచ్చరించారు.  
 
యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ ఇది. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు.  మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన  యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లే. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయి. 

ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడుదమని వీడియో కాల్ చేస్తే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్‌మెయిలింగ్‌ సెక్స్‌టార్షన్ కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కారు.. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలి. క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండి.  అంటూ ఆయన హెచ్చరించారు.ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడకండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. బీ అలర్ట్! అంటూ యువతకు సూచించారు.

#Social Media #Cyber ​​Crime #vc-sajjanar #cyber-alert #social media bad effect #honey-trap #social media accounts #social media and spying #Social Media Apps Ban
Advertisment
తాజా కథనాలు