Crime News : సంతానం కలిగిస్తామని నమ్మించి మోసం..నగలతో జంప్‌

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి పరిధిలోని గాంధీనగర్‌లో సంతానం లేని ఓ దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు వారికి సంతానం కలిగిస్తామని నమ్మించి నాలుగు తులాల బంగారు పుస్తెలతాడుతో ఉడాయించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

New Update
FotoJet - 2026-02-09T210542.607

Jump with jewelry

యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri-Bhongir district) భూదాన్‌ పోచంపల్లి(Bhoodan Pochampally) పరిధిలోని గాంధీనగర్‌లో సంతానం లేని ఓ దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు వారికి సంతానం కలిగిస్తామని నమ్మించి నాలుగు తులాల బంగారు పుస్తెలతాడుతో ఉడాయించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతానం కోసం ఎదురుచూస్తున్న ప్రణీత దంపతులతో ఓ వ్యక్తి కేరళ యునాని వైద్యుడినని(Unani docter) పరిచయం చేసుకున్నాడు.ఆ దంపతులను ఏమార్చి బంగారు ఆభరణాలతో పరారయ్యాడు.

Also Read :  ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిపై అఘాయిత్యం.. బలవంతంగా ఎత్తుకెళ్లి...

Gold Theft

బాధితురాలు వంగూరి ప్రణీత తెలిపిన వివరాల ప్రకారం.. సంతానం లేనివారికి సంతానం కలిగిస్తానని చెప్పి కేరళకు చెందిన వ్యక్తి తనను తాను యునానీ వైద్యుడిగా పరిచయడం చేసుకుని పట్టణంలో పర్యటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆ అగతంతకుడు ఉదయం ప్రణీత ఇంటికి వచ్చాడు. పిల్లలు లేరన్న విషయాన్ని ఆసరాగా చేసుకొని తనను తాను యునాని వైద్యుడిని అంటూ పరిచయం చేసుకున్నాడు. పిల్లలు కలగడానికి ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నారా అని అడిగి తెలుసుకుని గత రిపోర్టులను పరిశీలించి 40 రోజుల్లో ఫలితం దక్కుతుందని నమ్మబలికాడు.

ప్రణీతకు ఓ తైలం ఇచ్చి దానిని ఒంటికి రాసుకుంటే 40 రోజుల్లో ఫలితం వస్తుందని నమ్మించాడు.వైద్యం పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి యునాని మందుల పట్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దంపతులకు నమ్మకం కలిగించాడు. లిక్విడ్ రాసుకుంటే సంతానం కలుగుతుందని బురిడీ కొట్టించి మెడపై ఉన్న బంగారం(jewellary) తీయమని చెప్పి ఆమెకు ఏదో లిక్విడ్ రాసి ఇచ్చాడు. లిక్విడ్ రాసే సమయంలో మెడలో ఎలాంటి బంగారు ఆభరణాలు ఉండవద్దని ఒంటిపై మెటల్ ఉంటే మందు పనిచేయదని నమ్మించాడు. లిక్విడ్ రాసిన అనంతరం బాధితురాలిని స్నానానికి వెళ్ళమని చెప్పాడు. అంతేకాకుండా స్నానానికి వెళ్లి వచ్చేంతవరకు నగలను తాగవద్దని చెప్పాడు. అతను చెప్పినట్లే ఆమె స్నానానికి వెళ్లింది. స్నానం చేసి వచ్చేసరికి నగలు మాయం కావడంతో మోసపోయానని గమనించి బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. 

Also Read :  వ్యభిచారానికి అత్తమామలు బలవంతం.. కోడలు ఆత్మహత్య!

Advertisment
తాజా కథనాలు