BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యాన్ని ఆ పార్టీ ప్రకటించింది.రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తరువాత ఆయన పేరును ఆదివారం రాత్రి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.

New Update
nellikanti

nellikanti

సీపీఐ  ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యాన్ని ఆ పార్టీ ప్రకటించింది.రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తరువాత ఆయన పేరును ఆదివారం రాత్రి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. సత్యం సోమవారం ఉదయం 10 గంటలకు నామినేషన్‌ వేయనున్నారు.

Also Read: Champions Trophy 2025- India vs New Zealand LIVE: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.

సీపీఐ రాష్ట్ర  కార్యవర్గం ఫైనల్‌..

ఈయన ప్రస్తుతం సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా , పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. సత్యం పేరును ఆ పార్టీ జిల్లా ఇన్‌ ఛార్జి పల్లా వెంకట్‌ రెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. సీనియర్‌ నేత చాడ వెంకట్‌ రెడ్డి పేరునూ ప్రతిపాదించగా..తాను పోటీలో ఉండటం లేదని ఆయన ప్రకటించారు. దీంతో సత్యం పేరును సీపీఐ రాష్ట్ర  కార్యవర్గం ఫైనల్‌ చేసింది.

Also Read: ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!

అసెంబ్లీ ఎన్నికల సమయంలో మునుగోడు స్థానంలో పోటీ చేయాల్సిందేనని సీపీఐ నల్గొండ జిల్లా  నాయకత్వం పట్టుపట్టింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌, కొత్తగూడెం స్థానాన్ని కేటాయించిందని వివరిస్తూ భవిష్యత్తులో వచ్చే ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామని నెల్లికంటి సత్యానికి పార్టీ నాయకులు హామీ ఇచ్చారు.ఈ మేరకు తాజాగా ఆయన పేరును ఖరారు చేశారు.

1969 లో మునుగోడు మండలం ఎల్లలగూడెం గ్రామవాసి, పొలిటికల్‌ సైన్స్‌ లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు సత్యం. బీసీ వర్గానికి చెందిన ఆయనకు సీపీఐ ఉద్యమ నాయకుడిగా మంచి పేరుంది. 1985 నుంచి 2000 వరకు పార్టీ యువజన విభాగం ఏఐవైఎఫ్‌ నల్గొండ జిల్లా కార్యదర్శిగా,అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2010 నుంచి 2016 వరకు మునుగోడు మండల కార్యదర్శిగా,2016 నుంచి నల్గొండ జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శిగా,2020 నుంచి జిల్లా కార్యదర్శిగా ఉన్నారు.

Also Read:Champions Trophy: రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ ఇదే..

Also Read: NZ VS IND: జియో హాట్‌స్టార్ రికార్డ్.. భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 84 కోట్లకు చేరిన వ్యూస్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు