/rtv/media/media_files/2025/04/13/DmGEsf5H5b9kwh6lokNi.jpg)
Bhubharathi Portal
Bhubharathi Portal : రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది.రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.భూభారతి అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యేలా భూభారతిని రూపొందించాలని అధికారులకు సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని.. కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. భూభారతి వెబ్‌సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు.కాగా పోర్టల్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు.
భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు చెందిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు. ఈ పోర్టల్ ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
ప్రజలు, రైతులకు అర్ధమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ కార్యదర్శి జ్యోతి బుద్ద ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ప్రజల పాలిట శాపంగా మారిందని, భూ లావాదేవీలన్నింటినీ ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేసింది. భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల నుంచి ధరణి పోర్టల్‌లో ఎక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తింది. దీంతో 20 లక్షలకు పైగా రైతులు ధరణి పోర్టల్ కారణంగా ఆగమయ్యారని ఆరోపించింది.
Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు
CP: వాళ్లు నన్ను ట్రోల్ చేస్తారు.. భారత టీమ్‌పై సీవీ ఆనంద్ సెటైర్లు!
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నెటిజన్లతో చేసిన ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా 11 మందితో ఆడితే ఇండియా 9మందితో పోటీపడుతోందని సెటైర్లు వేశారు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లతో ప్రయోజనం లేదని, వారి పేరు చెబితే వాళ్ల ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారన్నారు.
Cp Cv Aanand Comments on Team India
CP Anand: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నెటిజన్లతో చేసిన ఓ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ వైరల్ అవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ పేలవ ప్రదర్శనపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జట్టును ముందుండి నడిపించాల్సిన సీనియర్స్ భారంగా మారారని, కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు పలకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే భారత్ ఆటతీరుపై సీవీ ఆనంద్ అభిప్రాయం తెలుసుకోవాలని ఉందంటూ ఓ నెటిజన్‌లు పోస్ట్ పెట్టాడు. దీంతో తనదైన స్టైల్ లో రియాక్ట్ అయిన సీపీ.. ఆస్ట్రేలియా 11 మందితో ఆడితే టీమ్ ఇండియా కేవలం 9మందితో పోటీపడిలే ఎలా అంటూ సెటైర్లు వేయడం విశేషం.
Also Read: అభిమానులకు 'KGF' హీరో బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే?
జీర్ణించుకోవడం చాలా కష్టం..
ఈ మేరకు 'అగ్రశ్రేణి జట్ల చేతిలో దారుణంగా ఓడిపోతున్నాం. జీర్ణించుకోవడం చాలా కష్టం. గత పర్యటనలో స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియాను ఓడించారు. ఇప్పుడు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఉన్నా ప్రయోజనం లేదు. నేను వారి పేరు చెప్పలేను. ఎందుకంటే వారి 'సోషల్ మీడియా ఆర్మీలు' నన్ను ట్రోల్ చేస్తాయి' అంటూ తన మనసులో మాట బయటపెట్టారు.
Also Read: Kambli: ‘చక్ దే ఇండియా’ పాటకు స్టెప్పులేసిన కాంబ్లీ.. వీడియో వైరల్!
Bhubharathi Portal : రేపే భూభారతి పోర్టల్ ఆరంభం..ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు
రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Waqf Amendement Bill : వక్ఫ్ బిల్లు.. ట్యాంక్ బండ్ పై ముస్లిం సంఘాల ఆందోళన
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన....Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Union Govt and CPI Maoist Party : మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
కేంద్ర ప్రభుత్వము, మావోయిస్టు పార్టి మధ్యన కాల్పుల విరమణ, శాంతి చర్చల.Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ not present in Meta description
Komatireddy Raj Gopal Reddy : నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నది జానారెడ్డే...రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Saleshwaram Jathara: : వత్తన్నం వత్తన్నం లింగమయ్యో..అంటూ తెలంగాణ అమర్ నాథ్ యాత్రకు...
ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా 4 రోజుల పాటు జరిగే సలేశ్వర లింగమయ్య జాతర ఘనంగా ప్రారంభమైంది. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి
హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్ వాహనాదారుడు మృతి చెందాడు.ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. 20 మంది మృతి
Bhubharathi Portal : రేపే భూభారతి పోర్టల్ ఆరంభం..ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు
AP: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 6గురి దుర్మరణం.. కన్నీరు పెట్టించే వీడియోలు..!
Waqf Amendement Bill : వక్ఫ్ బిల్లు.. ట్యాంక్ బండ్ పై ముస్లిం సంఘాల ఆందోళన
Jallianwala Bagh: జలియన్ వాలాబాగ్ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?