Telangana: కేబినెట్ విస్తరణ !.. ఢిల్లీకి కాంగ్రెస్‌ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు పార్టీ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ తదితర నేతలు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

New Update
CM Revanth, Batti Vikra marka and Uttam Kumar Reddy

CM Revanth, Batti Vikra marka and Uttam Kumar Reddy

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు పార్టీ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌తో పాటు పలువురు కీలక నేతలు ఢిల్లీ బయలుదేరారు. సోమవారం మధ్యాహ్నం.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో వీళ్లు సమావేశం కానున్నారు. 

Also Read: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ

ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది. రేవంత్ ప్రభుత్వం ఈ కేబినెట్ విస్తరణ ప్రక్రియను ప్రతీసారి వాయిదా వేస్తూ వస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌పై కేబినెట్ విస్తరణకు సంబంధించి విమర్శలు చేస్తూ వస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ ఉంటుందా ? లేదా తర్వాత ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది .  

Congress High Command Calls

Also Read: అదృష్టం అంటే ఈ అమ్మాయిదే.. కొత్తగా కొన్న ప్యాంట్‌ జేబులో డబ్బే డబ్బు!

ఇదిలాఉండగా సీఎం రేవంత్ ఏప్రిల్‌లో జపాన్‌లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 15 నుంచి 23వ తేది వరకు జపాన్ పర్యటన చేయనున్నారు. ఒసాకాలో ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పెట్టబడుల కోసం వివిధ పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. రేవంత్‌తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కూడా జపాన్‌కు వెళ్లనున్నారు. అయితే జపాన్ పర్యటన లోపే హైదరాబాద్‌లో డీలిమిటేషన్‌పై రేవంత్ సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది . 

Also Read: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్!

Also Read: వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అపర కుభేరుడు.. లగ్జరీ నౌకలో పెళ్లి!

 

Delhi Congress High Command | cm revanth | cabinet-expansion | telangana latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates | t-congress

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment