CM Revanth: పద్మ పురస్కారాల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష.. రేవంత్ ఫైర్

రాష్ట్రంలో వీసీల నియామకం యూజీపీ ద్వారా చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం గుంజుకుంటే ఎలా అని ప్రశ్నించారు. అలాగే పద్మ పురస్కారాల్లో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపించిందని విమర్శించారు.

New Update
CM Revanth

CM Revanth

కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్‌ విమర్శలు చేశారు. రాష్ట్రంలో వీసీల నియామకం యూజీపీ ద్వారా చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యూజీసీ ద్వారా కేంద్రం ప్రభుత్వం పెత్తనం మంచిది కాదన్నారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి హక్కును కేంద్రం హరించాలని చూస్తోందని విమర్శించారు. 

Also Read: హైదరాబాద్ వాసులకు అలర్ట్..  ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో!

'' యూనివర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది. ఈ కుట్రను అడ్డుకోవాలి. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి యూజీసీ రూల్స్‌పై పోరాడుతాం. యూజీసీ ప్రకటించిన కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి చేయడం లాంటిదే. రాష్ట్రాలపై కేంద్ర దండయాత్ర పని మొదలుపెట్టింది. ఇలాంటి విధానాలు ఉంటే దేశంలో రాజ్యాంగం మనుగడ ఉంటుందా ? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉంది. కేంద్రం యూజీసీ రూల్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులను కేంద్రం గుంజుకుంటే ఎలా ? ఇలా చేస్తే రాష్ట్రాలు నామమాత్రంగా అవుతాయి.  

Also Read: తేనెకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు చూశారా ? వీడియో వైరల్

 పద్మ అవార్డుల విషయంలో కూడా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించింది. రాష్ట్రం సిఫార్సు చేసిన వాళ్లకి పురస్కారాలు ఇవ్వలేదు. గద్దర్, చూక్కా రామయ్య, అందేశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్‌ తిరుమలరావు పేర్లను సిఫార్సు చేశాం. ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు ఇచ్చారు. కానీ తెలంగాణకు నాలుగైనా ఇవ్వలేదు. ఈ వివక్షపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాస్తా. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే ప్రొఫెసర్ల వయోపరిమితిని 65కు పెంచే ఆలోచన ఉందని'' సీఎం రేవంత్ అన్నారు. 

Also Read: జైలులో తమ్ముడు.. మరదలిపై కన్నేసిన అన్న: ఫ్రెండ్స్‌తో కలిసి 31 గంటలపాటు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు