సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన కామెంట్స్ చేశారు. . ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో చిట్‌చాట్ లో మాట్లాడిన ఆయన, తన రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర పరిపాలనపై ధీమా వ్యక్తం చేశారు. "తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఇక్కడ ఎవరూ పోటీ లేరు" అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాకుండా దేశంలో ఎన్నికల సంస్కరణలపై స్పందిస్తూ.. 2029లో ఖచ్చితంగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయని ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వ కాలపరిమితి మరో ఆరు నెలలు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత మరో విడత కూడా కాంగ్రెస్(congress) పార్టీయే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.
Also Read : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బిగ్ షాక్.. కేసు నమోదు!
ఫామ్ హౌస్‌కే పరిమితమై స్వీయ శిక్ష
రాజకీయ కక్ష సాధింపులు తమ నైజం కాదని, కేసీఆర్ ఇప్పటికే ఫామ్ హౌస్‌కే పరిమితమై స్వీయ శిక్ష అనుభవిస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ దశకు చేరుకుందని సీఎం వెల్లడించారు. అన్ని అంశాల్లోనూ ఆధారాలతోనే ముందుకు వెళ్తామని, కేసీఆర్ లేదా హరీశ్ రావు కోరినట్లుగా ప్రభుత్వం నడవదని స్పష్టం చేశారు. అలాగే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ విషయంలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు.
2027 వరకు జిల్లాల విభజన లేదా మార్పుల్లో ఎలాంటి మార్పులు ఉండవని, 2027లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు వంటి కీలక మార్పులు చోటుచేసుకుంటాయని వివరించారు.
Also Read : మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేది ఆ పార్టీయే.. RTV సంచలన సర్వే
CM Revanth Reddy : తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి : సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!
సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. . ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో చిట్‌చాట్ లో మాట్లాడిన ఆయన, తన రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర పరిపాలనపై ధీమా వ్యక్తం చేశారు.
CM Revanth