/rtv/media/media_files/2025/04/14/YcLDJdDJZ3TFGz8FdZBf.jpg)
CM Revanth Key Decision on Gig Workers
సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్’ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని ఆదేశించారు. గిగ్ వర్కర్లకు భద్రత కల్పించేచా ఈ బిల్లును తయారు చేయాలని అధికారులకు సూచించారు. గిగ్ వర్కర్ల భద్రతపై ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వాళ్లకి బీమా, ఇతర హక్కులు కల్పించేలా బిల్లు ఉండాలని అన్నారు. బిల్లు ముసాయిదాను ఆన్‌లైన్‌లో పెట్టి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ఆదేశించారు.
ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని వాటిని పరిశీలించి తుది ముసాయిదాను రూపొందించాలన్నారు. గిగ్ వర్కర్ల చట్టంలో కార్మికుల భద్రతకు సంబంధించి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఏప్రిల్ 25 నాటికి బిల్లు తుది ముసాయిదా సిద్ధం చేయాలన్నారు. మే డే రోజునే చట్టం అమల్లోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని కార్మికశాఖ ఉన్నాతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: అందుకే పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నా: మొదటి పెళ్లిపై అఘోరీ సంచలన వీడియో!
Also Read : రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపులతో గుచ్చి గుచ్చ.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!
Good News For Gig Workers
గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ రూపొందించిన ముసాయిదా “తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ బిల్లు”లో పొందుపరిచిన అంశాలను అధికారులు సీఎం రేవంత్‌కు వివరించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వటంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం ఉండేలా కొత్త చట్టం ఉండాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్స్ డ్రైవర్లు, ప్యాకేజ్ డెలివరీల్లో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని, అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాలని సీఎం సూచించారు.
గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లు మరణిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమాను పొందేలా 2023 డిసెంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇక సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితురులు పాల్గొన్నారు.
గిగ్ వర్కర్లకు భద్రత కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు.
— Telangana CMO (@TelanganaCMO) April 14, 2025
❇️గిగ్ వర్కర్లు,… pic.twitter.com/6bDvEgKza5
Also Read: మణిపూర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. వారి వద్ద ఏం దొరికాయో తెలుసా?
Also Read : నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాజీవ్ యువ వికాసం గడువు పెంపు
telugu-news | rtv-news | today-news-in-telugu | latest telangana news | latest-telugu-news