/rtv/media/media_files/2025/02/22/ISgqe5t0JFXKPG9ZZPBS.jpg)
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ (SLBC Tunnel) వద్ద జరిగిన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పై కప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్. ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని వారిని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.
Also Read : శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్‌లో ప్రమాదం!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి గారు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం…
— Telangana CMO (@TelanganaCMO) February 22, 2025
Also Read : స్వర్ణ విమాన గోపురం రికార్డు.. దేశంలోనే మొట్టమొదటిదిగా యాదగిరిగుట్ట ఆలయం రికార్డు!
10 మంది కార్మికులకు గాయాలు
శ్రీశైలం (Srisailam) ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది.
Also Read : డీజీపై కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు
నాలుగు రోజుల క్రితం ఎడమవైపు సొరంగం వద్ద మళ్లీ పనులు ప్రారంభం కాగా, శనివారం ఉదయం పైకప్పు కూలింది. ఇందులో ఏడు మంది కార్మికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. క్షతగాత్రలను వెంటనే జెన్ కో ఆసుపత్రికి తరలించారు.
Also read : స్వర్ణ విమాన గోపురం రికార్డు.. దేశంలోనే మొట్టమొదటిదిగా యాదగిరిగుట్ట ఆలయం రికార్డు!