/rtv/media/media_files/2025/02/28/8nDKdfh2y06qyVbUOZHd.jpg)
Telangana cabinet meeting
గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది. MLC ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు MLC గెలిచి.. అధికారంలో ఉండగా ఓడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం పరిచారు. నాయకుల్లో సమన్వయలేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ MLC ఎన్నికల్లో ఓడిపోయిందని సమావేశంలో నిర్థారించుకున్నారు. తర్వలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు రిపీట్ కావద్దని మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లోగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు.
Also Read: TG GPO jobs: ఉద్యోగాల జాతర.. 10వేల GPO పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఇక నుంచి జిల్లాల వారిగా సమీక్షలు, సమావేశాలు పెట్టాలని ఆయా జిల్లా మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. మూడు MLC ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కటి మాత్రమే గెలుచుకుంది. మిగిలిని రెండు టీచర్, గ్రాడ్యుయూట్ ఎమ్మెల్సీ స్తానాలను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.