TG News: మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. దేశంలోనే మొదటిసారి!

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రణాళికా సిద్ధం చేశామని సీఎం రేవంత్ అన్నారు. ఇందులో భాగంగానే నారాయణపేట జిల్లా అప్పక్ పల్లిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

New Update
petrol bunk

CM Revanth inaugurated women association petrol pump in Narayanpet

TG News: మహిళలకు తెలంగాణ ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల సమయంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చిన ఆయన ఆ దిశగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్ పల్లిలో  మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ఇది బీపీసీఎల్ కంపెనీ సహకారంతో పూర్తిగా మహిళలే నడిపించనున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసుకోవడం సంతోషం ఉందని, ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు..

మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారని మా ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం. ఈ పెట్రోల్ బంక్ రాష్ట్రంలోనే మొదటిది. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం. గమహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చాం. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నాం. సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందించనున్నాం. రూరల్, అర్బన్ అనే తేడా లేదు తెలంగాణలో మహిళలంతా ఒక్కటే అని చెప్పారు. 

ఇది కూడా చదవండి: Krishna Water Dispute: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల లొల్లి.. అసలేంటి వివాదం ?

ఇక అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందామన్నారు సీఎం రేవంత్. ఎంపీ డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టండి నిధులు మేం ఇస్తాం. నిర్వహణ మీరు చేయండి. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలని సూచించారు. 

ఇది కూడా చదవండి: Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ...  70శాతం సక్సెస్ రేటు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment