BIG News: మంత్రి పదవులిస్తే విలీనానికి సై.. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం!

తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ రంగం సిద్ధం చేశారట. అయితే పార్టీ మారే వారంతా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఢిల్లీ పెద్దలతో మంతనాలు నడుస్తున్నాయట.

New Update
telangana cm

telangana cm Photograph: (telangana cm)

BIG News: తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు జరగబోతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ బిగ్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే దీనిపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొన్ని కండీషన్లు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి మొత్తం 26 మంది అవుతారు. అయితే కొత్తగా వచ్చే వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని షరతులు పెడుతున్నారట. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో మరో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడుగుతున్నారట. దీనిపై కాంగ్రెస్ లో అంతర్గత చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. 

బీఆర్ఎస్ఎల్పీ విలీనం దాదాపు ఖాయం..

బీఆర్ఎస్ లో 38 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందగా 10 మంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఫిరాయింపులపై న్యాయపరమైన పోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టులో కేసు వేయగా వారందరికీ నోటీసులు వచ్చాయి. ఈ తరుణంలోనే మరో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే 2/3 మెజారిటీ షరతు పూర్తైతే బీఆర్ఎస్ఎల్పీ విలీనం దాదాపు ఖాయమైనట్లే. అలా జరిగితేనే న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తవని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ముందుకురాకపోగా స్థానిక ఎన్నికల వరకు మరింత దెబ్బతింటుందని, పోటీ ఇచ్చే స్థాయి అభ్యర్థులు దొరకకుండా చేయాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. 

మరో ప్రతిపాదన పెట్టాలని సూచన..

బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది పార్టీ మారేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పార్టీ మారితే తమకు లాభం జరిగేలా చూసుకుంటున్న నేతలు మంత్రి పదవులకే ఎసరు పెట్టారట. దీంతో 4 మంత్రి పదవులు కష్టమని, మరేదైన ప్రతిపాదన పెట్టాలని ఏఐసీసీ పెద్దలు సూచించినట్లు సమాచారం. హోదా ఉన్న పోస్టు, ఆర్థిక లావాదేవీలు, బిల్లులకు సంబంధించిన బాధ్యతలు ఇవ్వాలని అడుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మెదక్ జిల్లాతోపాటు హైదరాబాద్ గ్రేటర్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మె్ల్యే సైతం డీల్ చేస్తునట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఒకరు మినహా మిగతా వారంతా కాంగ్రెస్‌లో చేరేందుకు ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. 

రాహుల్ గాంధీ సమక్షంలో ఆ నలుగురు..

కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఒక్క సీటు గెలవలేదు. రంగారెడ్డి, మేడ్చల్ ల్లో మాత్రమే 2 స్థానాలు దక్కించుకుంది. దీంతో 2 ఉమ్మడి జిల్లాల నేతలకు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా పదవులు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు లేరు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టాలని యోచిస్తోంది. అలాగే ఓ నలుగురు బీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు డేట్ ఖరారు చేసుకున్నట్లు  తెలుస్తోంది. అయితే ఈ వారమే జరగాల్సి ప్రక్రియ కులగణన, రిజర్వేషన్లతో వాయిదా పడగా టికెట్స్ బుక్ చేసుకుని రద్దు చేసుకున్నారట. ఇక ప్రస్తుతం ఆరుగురిని మంత్రి వర్గంలోని తీసుకునే అవకాశం ఉండగా లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతున్నప్పటికీ కొలిక్కి రావట్లేదట. 

ఇది కూడా చదవండి: TG News: రేవంత్ ఖబర్దార్.. మోదీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తావా? సీఎంకు ఏలేటి మహేశ్వర రెడ్డి వార్నింగ్!

మంత్రి వర్గ విస్తరణలో 6 మంత్రి పదవులతో పాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. 8 మందికి కేబినెట్ స్థాయి పోస్టులు ఇచ్చి బుజ్జగించాలని రేవంత్ సర్కార్ చూస్తోందట. మంత్రివర్గంలో హోం శాఖ, మున్సిపల్, విద్య, ఎస్సీ, ఎస్టీ తదితర శాఖలకు ఇప్పటికీ మంత్రులు లేకపోగా ఒక్కో మంత్రి దగ్గర మూడు, నాలుగు శాఖలున్నాయి. దీంతో పార్టీలో కొత్తగా చేరిన వారికి బాధ్యతలు కట్టబెట్టాలని చూస్తున్నారట. బీఆర్ఎస్ఎల్పీ విలీనం జరిగితే వారికి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా హస్తం గూటికి చేరాలని చూస్తున్నారట. వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా వాటిని కైవసం చేసుకువాలంటే కాంగ్రెస్ లో చేరడమే మంచి అవకాశంగా చూస్తున్నారట. మొత్తంగా గతంలో బీఆర్ఎస్ చేసిన పనినే ఇప్పుడు కాంగ్రెస్ చేసి దెబ్బకు దెబ్బ కొట్టాలని చూస్తోంది. 

ఇది కూడా చదవండి: Sukesh Chandrashekar love letter : హీరోయిన్‌‌కి జైలు నుంచి లవ్ లెటర్.. లవర్స్ డే కానుకగా ప్రైవేట్ జెట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌ షాక్.. మూడు కేసులు నమోదు!

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  

New Update
mla-rajasingh cases

mla-rajasingh cases

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  శోభాయాత్రలో రాజాసింగ్‌ మాట్లాడుతూ ఉండగా.. భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ.. భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో  భక్తులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తే..లాఠీలకు మేమూ పని చెప్తామంటూ రాజాసింగ్‌ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.  

ఇక ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్‌పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు.  ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్‌ కీలక కామెంట్స్ చేశారు.

ముస్లింలకు వ్యతిరేకం కాదు

వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్‌ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని  9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు.  ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు. 

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

Advertisment
Advertisment
Advertisment