Maoist: పోలీసుల ఆపరేషన్ సక్సెస్.. భారీగా లొంగిపోయిన మావోయిస్టులు!

మవోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇందులో హిడ్మా టీమ్ ముగ్గురు సభ్యులున్నట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.

New Update
maoist sur

Bhadradri kottagudem 19 Maoists surrendered

Maoist: మవోయిస్టులకు మరో భారీ దెబ్బ పడింది. భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కమాండర్ గా వ్యవహరిస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిళ్లా ఆర్మీ మొదటి బెటాలియన్ కు చెందిన ముగ్గురు సభ్యులున్నారు. పోరాడలేక అలసిపోయామని, సాధారణ జీవితం గడిపేందుకే లొంగిపోయినట్లు మావోయిస్టులు చెబుతున్నారు.

మావోలకు ఆపరేషన్ చేయూత..

ఈ మేరకు జనజీవన స్రవంతిలో కలిసే మావోలకు ఆపరేషన్ చేయూత పేరిట ప్రత్యేక సరెండర్ పాలసీని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే  ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు కొంతమంది తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. వారిలో సౌత్ బస్తర్ డీవీసీఎం నరోటి మనీష్ అలియాస్ ఆకాష్ ఉండగా అతనిపై రూ. 8లక్షల రివార్డు ప్రకటించింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ మొదటి బెటాలియన్ కు చెందిన మడివి నంద, మడివి హండా , మడివి హడమ సహా పలువురు సెంట్రల్ కమిటీ మెంబర్లకు గార్డుగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.
నందా, హండాపై 4లక్షల రివార్డు ప్రకటించింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!

ఇక పలు విధ్వంసకర ఘటనల్లో కీలకపాత్ర పోషించిన 19 మంది మావోయిస్టులు ఆ పార్టీ సభ్యుల సరెండర్ లో కీలకపాత్ర పోషిస్తున్నట్లు భద్రాధ్రికొత్తగూడెం పోలీస్ యూనిట్ తెలిపింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 78 మంది మావోయిస్టులను సరెండర్ చేసి 64 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. లొంగిపోయిన 78 మందిలో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ సహా 16 మంది ఏరియాకమిటీ మెంబర్లున్నట్లు చెప్పింది. గత ఏడాది జరిపిన యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో తెలంగాణ గ్రేహౌండ్స్, భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పోలీసులు మొత్తం ఏడుగురిని మట్టుబెట్టారు. 

ఇది కూడా చదవండి: TG Private Schools: మధ్యతరగతి పేరెంట్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గనున్న ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు!

మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం సభ్యుడు నల్లమరి అశోక్ అలియాస్ విజేందర్ మణుగూరుతోపాటు పాల్వంచ డీసీఎం కమాండర్ లచ్చన్న టీంను వాష్ అవుట్ చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. స్టేట్ కమిటీ మెంబర్ ఇల్లందు - నర్సంపేట ఏరియా కమాండర్ మావోయిస్టు భధ్రు టీంను గత ఏడాది ములుగులో ఎన్ కౌంటర్ చేశారు. భద్రాధ్రికొత్తగూడెం జిల్లా సరిహద్దు అటవీప్రాంతంలో  లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ఎదుట ప్రవేశపెట్టగా ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ , ఓఎస్డీ పరితోష్ పంకజ్, సీఆర్పీఎఫ్ బెటాలియన్ కమాండెట్స్ రాజేష్ గోండ్రా పాల్గొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chiru Family: సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు

చిరంజీవి దంపతులు అర్జంటుగా సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. నిన్న మంటల్లో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్  చూసేందుకు నాన్నతో పాటూ పెదనాన్న కూడా వెళ్ళారు.

New Update
ts

Chiru Family

పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చదువుకుంటున్నాడు. ఈ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరగడంతో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్‌ మన్యం పర్యటన తర్వాత సింగపూర్ వెళ్లారు. ఆ అబ్బాయి పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం వలన చేతులకు, కాళ్ళకు గాయాలవ్వడమే కాక..ఊపిరితిత్తుల్లోకి పొగ కూడా వెళ్ళి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల దీర్ఘకాలికంగా సమస్యలు వస్తాయని అంటున్నారు.

ఎయిర్ పోర్ట్ లో చిరంజీవి దంపతులు..

ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయన తన కొడుకు చూసేందుకు సింగపూర్ వెళ్ళారు. అయితే పవన్ తో పాటూ అన్న చిరంజీవి, వదిన సురేఖ కూడా అక్కడకు బయలుదేరి వెళ్ళారు. హైదరాబాద్ విమానాశ్రయంలో పవన్, చిరంజీవి, సురేఖలు కనిపించారు. అక్కడకు వెళ్ళాక బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అవసరమైన, మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. కొడుకు పరిస్థితి బాగుపడే వరకూ పవన్ అక్కడే ఉండనున్నారు. 

 

today-latest-news-in-telugu | family | Pawan Kalyan | son

 

Also Read: TS: ముగిసిన శ్రవణ్ రావు విచారణ..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అడుగు

Advertisment
Advertisment
Advertisment