LASHKAR E TAIBA : హైదరాబాద్‌లో మరో కుట్రకు 'లష్కరే తోయిబా' యత్నం..ఏకంగా - చంచల్​గూడ జైలు నుంచే మాస్టర్ ప్లాన్‌

చంచల్‌గూడ జైలు కేంద్రంగా హైదరాబాద్‌లో మరో ఉగ్రకుట్రకు లష్కరే తోయిబా పన్నిన కుట్ర బట్టబయలైంది. ప్రస్తుతం చంచల్‌ గూడ జైలులో ఉన్న లష్కరే ఉగ్రవాది జాహెద్ హైదరాబాద్‌లో కుట్రకు పాకిస్థాన్‌లోని తన సహచరులతో ఫోన్‌లో మాట్లాడినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

New Update
FotoJet (22)

Another conspiracy attempt by 'Lashkar e Taiba' in Hyderabad

LASHKAR E TAIBA : చంచల్‌గూడ జైలు కేంద్రంగా హైదరాబాద్‌(hyderabad) లో మరో ఉగ్రకుట్రకు లష్కరే తోయిబా పన్నిన కుట్ర బట్టబయలైంది. ప్రస్తుతం చంచల్‌ గూడ జైలు(Chanchalguda jail) లో ఉన్న లష్కరే తోయిబా(lashkar-e-taiba) ఉగ్రవాది జాహెద్ - హైదరాబాద్‌లో కుట్రకు పాకిస్థాన్‌(pakistan) లోని తన సహచరులతో ఫోన్‌లో మాట్లాడినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. మూడు సంవత్సరాల  క్రితం దసరా పండుగ రోజున హైదరాబాద్‌లో వరుస పేలుళ్లకు ప్రయత్నించడంతో పాటు హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు జాహెద్‌ కుట్ర పన్నాడు.  అయితే కుట్రను ముందే పసిగట్టిన నిఘా వర్గాలు మూసారాంబాగ్‌కు చెందిన అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు, అక్చర్‌బాగ్‌కు చెందిన మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమి, మాజ్ హసన్ ఫరూక్ అలియాస్ మాజ్‌లను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వీరి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

Also Read :  రాజ్యసభ సీటుకోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ.. రేసులో డజను మంది..

Another Conspiracy Attempt By 'Lashkar E Taiba In Hyderabad

అయితే ప్రస్తుతం చంచల్‌ గూడ జైలులో ఉన్న జాహెద్‌ మరో కుట్రకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆ విషయాన్ని నిర్ధారించుకునేందుకు నిఘా వర్గాలు ఈ నెల 17న హైదరాబాద్‌ నగరానికి వచ్చాయి. జాహెద్, పాకిస్థాన్​లోని తన సహచరులతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు ఇంటెలిజెన్స్​ అనుమానిస్తోంది.  ముఖ్యంగా పాకిస్థాన్​లో ఉన్న తన సోదరుడైన మాజీద్​తో మొబైల్​ ఫోన్​లో మాట్లాడుతున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. తొలుత జైలు నుంచి పాకిస్థాన్‌కు ఫోన్​ కాల్స్​ వెళ్తున్నట్లు గుర్తించిన అధికారులు,దర్యా్ప్తు చేయగా ఆ కాల్స్ మాజీద్ మాట్లాడుతున్నట్లు నిర్ధారించారు. కాగా ఈ విషయపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల బృందాలు వచ్చాయి. దీనిపై ఆరా తీస్తున్నాయి. ఈ విషయంపై ఆరా తీయగా, జైలు నుంచి మాజిద్ ఫోన్ మాట్లాడుతున్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని నిఘా అధికారి స్పష్టం చేయడం సంచలనం రేపింది.

అయితే దీన్ని బట్టి జాహెద్‌ ఆధర్యంలో నగరంలో మరోసారి భారీ కుట్రకు లష్కరే తోయిబా(Lashkar-e-Taiba Terrorists) ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన నియామకాలు కూడా చేపట్టారని, అవసరమైన ఆర్థిక సాయం వారికి పాకిస్తాన్ నుంచి అందుతున్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

కాగా గత మూడేండ్ల క్రితం హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నిన కేసులో 2022 అక్టోబరు 2న మూసారాంబాగ్‌కు చెందిన అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు, అక్చర్‌బాగ్‌కు చెందిన మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమి, మాజ్ హసన్ ఫరూక్ అలియాస్ మాజ్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా జాహెద్ నుంచి 2 హ్యాండ్ గ్రనేడ్స్, రూ. 3,91,800 నగదు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  సమీయుద్దీన్ నుంచి హ్యాండ్ గ్రనేడ్, రూ.లక్షన్నర నగదు, మొబైల్ ఫోన్, ఒక బైక్, మాజ్‌హసన్ నుంచి గ్రనేడ్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే పండుగ సమయాల్లో పాత నేరస్థులపై సోషల్ మీడియాలో నిఘా ఉంచిన పోలీసులు మాజిద్ బృందం కుట్రను పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాది ఫర్హతుల్లా గోరీ, అబు అంజాలా, జాహెద్ సోదరుడైన మజీద్ ఆదేశాలతో హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారు. కాగా పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సాయం పాకిస్థాన్‌ నుంచి అందినట్లు అప్పట్లోనే జాహెద్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. హవాలా మార్గంలో రూ.33 లక్షలు అందగా, ఫరతుల్లా ఘోరీ 4 గ్రనేడ్లు పంపినట్లు చెప్పాడు. కాగా ప్రస్తుతం జైల్లో ఉన్నప్పటికీ వారి ఉగ్రకుట్రను వదలలేదని నిఘావర్గాలు తేల్చి చెప్పాయి.

Also Read :  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ పీఏ భార్య అనుమానస్పద మృతి

Advertisment
తాజా కథనాలు