Big Breaking: భారీ ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి!
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
లక్ష్మిపై పులిదాడి ఘటనలో భయంకర నిజాలు బయటపడ్డాయి. కొత్త ఆవాసం, ఆడపులులతో శృంగారం, ఆహారం దొరకనపుడు వాటి మానసికస్థితి దెబ్బతింటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే ఎదురుపడిన పశువులు, మనుషులను చంపుతాయని చెప్పారు.
ఆసిఫాబాద్ జిల్లాలో పులిదాడిలో మరణించిన యువతి లక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం అందించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియ పూర్తిచేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారంలో విషాదం చోటుచేసుకుంది. మోర్లే లక్ష్మి అనే మహిళ పత్తిచేనులో పని చేస్తుండగా పులి పంజాకు బలైయింది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అధికారులను సస్పెండ్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
తెలంగాణలో వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. బంగాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు జల్లులు కురుస్తాయని చెప్పారు
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో హైటెన్షన్ వాతావరణం చేటుచేసుకుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామస్థులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న ఆర్డీవో రత్నకల్యాణిని కారులోనే దాదాపు 5 గంటలుగా నిర్బంధించారు.
ఫుడ్ పాయిజన్‌కు గురై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ ఇవాళ మృతి చెందింది. ఇటీవల 60 మంది ఫుడ్ పాయిజన్ బారిన పడగా.. అందులో ముగ్గురి పరిస్థితి విషమించింది. ఇద్దరు కోలుకోగా విద్యార్థిని శైలజ మృతి చెందింది.
శృంగారం కోసం 'లవ్‌లోర్న్ జానీ' అనే మగపులి 300 కి.మీ ప్రయాణించింది. సహచరికోసం మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ నడుచుకుంటూ వచ్చింది. ఇవి 100 కి.మీ దూరం నుంచి ఆడ పులులు విడుదల చేసే ప్రత్యేక సువాసనను గుర్తించగలవని అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ తెలిపారు.
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది.హైదరాబద్ శివారు ప్రాంతాల్లోనూ చలి పులి పంజా విసురుతోంది. కొన్ని ఏరియాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.