Tiger: పులి మనిషి రక్తానికి మరిగిందా.. లక్ష్మిపై దాడిలో భయంకర నిజాలు!

లక్ష్మిపై పులిదాడి ఘటనలో భయంకర నిజాలు బయటపడ్డాయి. కొత్త ఆవాసం, ఆడపులులతో శృంగారం, ఆహారం దొరకనపుడు వాటి మానసికస్థితి దెబ్బతింటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే ఎదురుపడిన పశువులు, మనుషులను చంపుతాయని చెప్పారు.

New Update
rerer

Tiger : కుమురంభీం జిల్లా గన్నారంలో యువతిపై పులి దాడి చేసిన ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పత్తి ఏరేందుకు వెళ్లిన లక్ష్మిని చంపిన పెద్దపులి మహారాష్ట్రకు చెందినదిగి అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సిర్పూర్‌ మండలంలో రెండు పులులుండగా.. ఇప్పటి వరకూ అవి మనుషులపై దాడి చేయలేదని ఆసిఫాబాద్‌ డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ చెప్పారు. లక్ష్మిపై క్రూరంగా దాడి చేసి మెడ కొరికిన పులి మనిషి రక్తం మరిగినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే

మానసికస్థితి దెబ్బతినడంతో దాడి.. 

ఈ మేరకు కేసు దర్యాప్తులో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'పెద్దపులులు రెండేళ్ల వయసు దాటగానే తల్లి నుంచి విడిపోయి కొత్త ప్రాంతంలో ఆవాసం ఏర్పరచుకుంటాయి. ఆ తర్వాత ఆడతోడుతోపాటు కొత్త ఆవాసం కోసం మరో ప్రాంతానికి వలస వెళతాయి. పులుల సంఖ్య పెరిగినప్పుడు ఆవాసం కోసం పోట్లాడుకుంటాయి. ఈ పోరులో ఓడిపోయినవి కొత్త ఆవాసాలను వెతుక్కుంటూ వెళతాయి. అయితే రోజుల తరబడి తిరుగుతున్న క్రమంలో  ఆహారం, ఆవాసం దొరకనపుడు మానసికస్థితి దెబ్బతింటుంది. దీంతో ఎదురుపడిన పశువులు, మనుషులను చంపుతాయి' అని వివరించారు. 

ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

మహారాష్ట్రనుంచి వలసలు.. 

గత రెండేళ్లుగా పెద్దపులి సంచరించిన అనవాళ్లు లేవు. దాడి చేసింది వలస వచ్చిన పులి. మా కెమెరాలకు దాని ఫొటోలు చిక్కలేదు. ఇది పులులు శృంగారం జరుపుకునే సమయం. దాడి చేసిన పులి డిస్టర్బ్‌ అయినట్లు ఉంది. దానికి రెండున్నరేళ్ల వయసు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక కుమురం భీం జిల్లాలో నాలుగేళ్లలో నలుగురు పెద్దపులుల చేతిలో మరణించగా.. ఘటన ప్రాంతానికి 20 కి.మీ. దూరంలోనే మహారాష్ట్ర ఉండటంతో పులులు అక్కడినుంచే వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు