ఫుడ్ పాయిజన్‌కు గురైన బాలిక మృతి.. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

ఫుడ్ పాయిజన్‌కు గురై నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ ఇవాళ మృతి చెందింది. ఇటీవల 60 మంది ఫుడ్ పాయిజన్ బారిన పడగా.. అందులో ముగ్గురి పరిస్థితి విషమించింది. ఇద్దరు కోలుకోగా విద్యార్థిని శైలజ మృతి చెందింది.

New Update
crime,

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్‌‌కు గురై పలువురు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. తాజాగా ఫుడ్ పాయిజన్‌కు గురై ట్రీట్మెంట్ పొందుతున్న విద్యార్థిని శైలజ (16) మృతి చెందింది. గత కొద్ది రోజులుగా నిమ్స్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విద్యార్థిని శైలజ పరిస్థితి విషమించడంతో సోమవారం ప్రాణాలు కోల్పోయింది. 

Also Read: చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని విద్యార్థి మృతి

ఏం జరిగింది..

అక్టోబర్ 30వ తేదీన వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజనం చేసిన అనంతరం చాలా మంది విద్యార్థినులు అశ్వస్థతకు గురయ్యారు. దాదాపు 60 మంది విరేచనాలు, వాంతులతో అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో వారందరినీ సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. 

Also Read: మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే..

వీరిలో ముగ్గురి పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో నవంబర్ 5న మెరుగైన వైద్యం కోసం పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అందులో ఇద్దరు విద్యార్థినులు కోలుకున్నారు. కానీ మూడో బాలిక శైలజకు వెంటిలేటర్‌పైనే ట్మీట్మెంట్ అందిస్తున్నారు.

ఇక పరిస్థితి విషమించడంతో శైలిజ సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. దీంతో శైలజ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

మరో విషాదం

 సికింద్రాబాద్ పరిధిలోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో విరన్ జైన్ అనే విద్యార్థి ఆరవ తరగతి చదవుతున్నాడు. రోజు మాదిరిగా విరన్ జైన్ ఈరోజు (సోమవారం) స్కూల్‎కు వెళ్లాడు. లంచ్ బ్రేక్ లో ఇంటి నుండి తెచ్చుకున్న చపాతి తిన్నాడు. అదే క్రమంలో చపాతి విరన్ జైన్ గొంతులో ఇరుక్కుపోయింది. 

ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు వెంటనే అప్రమత్తమై స్కూల్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడిని సిబ్బంది తక్షణమే ఆసుపత్రికి తరలించారు. 

అయితే ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే పరిస్థితి విషమించి విరన్ జైన్ మరణించాడు. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది విద్యార్థి కుటుంబ సభ్యులకు  తెలిపారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న విరన్ జైన్ ఫ్యామిలీ మెంబర్స్.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు