Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంత ఓటింగ్ శాతమంటే ?

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(తూర్పు), యూపీలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

New Update
Delhi Assembly Polling

Delhi Assembly Polling

Delhi Assembly Elections: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress Rahul Gandhi), ఢిల్లీ సీఎం అతిషి(Atishi Marlena) తదితరులు తొలిగంటల్లోనే ఓటు వేశారు. బుధవారం ఉదయం 7.00AM గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 5.00PM గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అయితే  మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.   

Also Read: తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా.. ప్రకటించిన సీఎం రేవంత్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(తూర్పు), ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ రెండు చోట్ల 42.41 శాతం, 44.59 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈరోడ్‌ ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్‌ ఇటీవల మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు అయోధ్య జిల్లా మిల్కిపుర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలను బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి.  

Also Read: చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌ వాడొద్దు.. కేంద్రం సంచలన ప్రకటన

ఇదిలాఉండగా..

ఢిల్లీలో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 13,766 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇంటి నుంచి ఓటు వేసే అర్హత ఉన్న 7,553 మంది ఓటర్లలో ఇప్పటిదాకా 6,980 మంది ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇక ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Also Read: కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!

Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్‌.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు