MLC Kavitha:తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్మూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆమె.. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం కష్టపడ్డవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని సూచించారు. By Karthik 25 Aug 2023 in రాజకీయాలు నిజామాబాద్ New Update షేర్ చేయండి MLC Kavitha in Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్ (BRS) ఆశీర్వాద ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి కవిత పాదయాత్ర చేశారు. అనంతరం మాట్లాడిన కవిత రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లుతోందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ రైతులకు రైతుబంధు(RYTHU BANDHU), రైతుబీమా(RYTHU BIMA)తో పాటు వరిధాన్యం కొనుగోళ్లు చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలోనే అనేక చెరువులు వేసవికాలంలో సైతం అలుగుపోస్తున్నాయని కవిత వెల్లడించారు. Your browser does not support the video tag. Your browser does not support the video tag. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు. గ్రామ స్థాయిలో పర్యటనలు చేసిన గ్రామాల్లోని ఇంటింటికి బీఆర్ఎస్ కార్యక్రమం చేపట్టాని, ప్రజలకు గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించాలన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడాల్సిన సమయం ఇదే అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఎన్నికల అనంతరం కేసీఆర్ తగిన ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టే అధికారంలోరి వస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. Your browser does not support the video tag. Your browser does not support the video tag. మరోవైపు కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ విషం వెల్లగక్కిందని మండిపడ్డారు. మూడు గంటల విద్యుత్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్ అన్న విషయాన్ని గుర్తు చేసిన కవిత.. 3 గంటల విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ కావాలా 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్‌ఎస్ కావాలో రైతులు ఆలొచించాలని సూచించారు. మరోవైపు ఎమ్మెల్యే కవిత బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో రైతులు కొన్ని నెలలుగా ధర్నాలు చేశారని, రైతులపై కేంద్ర మంత్రులు వాహనాలు ఎక్కించి చంపేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులు ఎట్టకేలకు రైతులకు తలొగ్గిన ప్రధాని నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు. త్వరలో తెలంగాణలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి కేసీఆర్ అన్న కవిత.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించే దమ్ముందా అని కవిత సవాల్ విసిరారు. Your browser does not support the video tag. Also Read: ప్రజాయుద్ధ నౌక గద్దర్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రధాని మోడీ లేఖ! #brs #kcr #congress #bjp #revanth-reddy #nizamabad #kavitha #mlc #jeevan-reddy #mlc-kavitha-in-nizamabad #armor #pemhara #mlc-kavitha-padayatra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి