Telanagna: పదేళ్ళల్లో పరిష్కారం కాని అంశాలపై చర్చించాం- భట్టి విక్రమార్క

గత పదేళ్ళలో పరిష్కారం కాని అంశాలపై చర్చించామని చెప్పారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయితే పండింగ్ సమస్యలన్నీ ఒక్కసారే పరిష్కారం అవుతాయని తాము అనుకోలేదని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మంత్రులతో కమిటీ వేస్తామని తెలిపారు.

New Update
Telangana: ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్‌ నాలెడ్జ్ సెంటర్ : భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka:  పెండింగ్ సమస్యలు అన్నింటికి ఈ సమావేశంలో నే పరిష్కారం లభిస్తుంది అని మేము అనుకోలేదు కానీ గత పదేళ్ళలో పరిష్కారం కాని అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ చర్చించారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అయితే పరిష్కార మార్గాలకు మాత్రం నిర్ణయం జరిగిందని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో త్రిమెన్ కమిటీ వేయాలని నిర్ణయించామని అన్నారు.రెండు వారాల్లో ఈ కమిటీ ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని భట్టి వెల్లడించారు.అలాగే రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ వేస్తామని..అధికారుల స్థాయిలో పరిష్కారం కానీ అంశాలను మంత్రుల స్థాయిలో పరిష్కరిస్తామని తెలిపారు. ఒకవేళ మంత్రుల స్థాయిలో కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే...ఆ అంశాలపై మరోసారి సీఎం ల స్థాయిలో భేటి అవతారని చెప్పారు.

ఇక రెండు రాష్ట్రాల్లో యాంటి నార్కోటిక్ , సైబర్ క్రైం నియంత్రణ కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాలని నిర్ణయించామని తెలిపారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రెండు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయిలో ఈ సమన్వయం జరుగుతుందని చెప్పారు. ఈ మేకు దాదాపు రెండు గంటలపాటు సాగిన భేటీలో పది కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులు, షెడ్యూల్‌ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది.

ప్రధానంగా రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చ జరిగింది. అలాగే విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అంశాలు, పెండింగ్‌ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించిన అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు, హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశంతోపాటు లేబర్‌ సెస్‌ పంపకాలు ఉద్యోగుల విభజన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

అలాగే ఏపీలో కలిసిన 7 మండలాల్లో 5 గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని సీఎ రేవంత్.. చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగుడెం, పిచ్చకలపాడు పంచాయితీలు కావాలని కోరారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్న కొన్ని భవనాలను తమకే కేటాయించాలని ఏపీ ప్రభుత్వం అడగ్గా.. దీనికి రేవంత్ సర్కార్‌ తిరస్కరించినట్లు సమాచారం. షెడ్యూల్‌ 9, 10లో ఉన్న అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, బి.సి.జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, ఇతర అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.

Also Read:Delhi: నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు-సునీత కేజ్రీవాల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment