/rtv/media/media_files/2025/04/02/7dK8hXBwD7P9R0VmAEAB.jpg)
Samsung BeSpoke AI smart fridges Can Find Misplaced Phones
సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) ప్రత్యేక పాత్ర కనిపిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి AI మరింత దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే అనేక ప్రొడక్టులు AI ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు తక్కువ సమయంలో స్మార్ట్ వర్క్ కోసం AI ఫీచర్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ ఫీచర్ సహాయంతో మరో ప్రొడెక్ట్ అందుబాటులోకి వచ్చింది.
Also Read: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ Samsung కంపెనీ బెస్పోక్ AI-ఆధారిత రిఫ్రిజిరేటర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో అధునాతన ఫీచర్లను అందించింది. ఈ ఫ్రిడ్జ్‌లో ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా అందించారు. దీని సహాయంతో పోగొట్టుకున్న ఫోన్‌ను ఈజీగా కనుక్కోవచ్చు.
Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!
Samsung Bespoke AI-Powered Refrigerator
Samsung కొత్త బెస్పోక్ AI-పవర్డ్ రిఫ్రిజిరేటర్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇది ఫైండ్ మై ఫోన్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులో 9 అంగుళాల హోమ్ స్క్రీన్ ఉంది. ఈ ఫ్రిడ్జ్ వాయిస్ కమాండ్‌లతో వస్తుంది. అందువల్ల వినియోగదారులు కోల్పోయిన తమ ఫోన్‌ను వారి వాయిస్‌తోనే కనుక్కోవచ్చు. ఈ ఫ్రిడ్జ్‌లో ప్రత్యేకత ఏంటంటే.. ఇంట్లోని సభ్యులందరి వాయిస్‌ని గుర్తించడంతోపాటు వారి ఫోన్‌లను కూడా ఇది యాక్సెస్ చేయగలదు.
Also Read: ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!
పోగొట్టుకున్న ఫోన్‌ను ఎలా కనుగొనాలి?
కొత్త బెస్పోక్ AI-పవర్డ్ ఫ్రిడ్జ్ మొబైళ్లను యాక్సెస్ చేసే ఫీచర్‌ను కలిగి ఉంది. అందువల్ల మీరు మీ ఫోన్‌ను ఇంట్లో ఏదో ఒక ప్లేస్‌లో పెట్టి మర్చిపోతే.. దానిని కనుగొనమని మీ వాయిస్‌తో కమాండ్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ ఎక్కడ ఉందో ఫ్రిడ్జ్ ట్రాక్ చేసి ఆ ప్లేస్‌ను చెప్తుంది. దీనికోసం పోగొట్టుకున్న ఫోన్‌ను కనుగొనడానికి.. మీరు ‘‘హాయ్ బిక్స్బీ, నా ఫోన్‌ని కనుగొనండి’’ అని చెప్పాలి. దీని తర్వాత స్మార్ట్ అసిస్టెంట్ వెంటనే మీ ఫోన్‌కి కాల్ చేస్తుంది. దాని ద్వారా పోగొట్టుకున్న ఫోన్ మీకు దొరుకుతుంది.
ఇతర స్మార్ట్ డివైస్‌లు కూడా
మీరు మీ ఫోన్‌ను మాత్రమే రిఫ్రిజిరేటర్‌కు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే.. రిఫ్రిజిరేటర్ నుండి ఇతర డివైజ్‌లకు కూడా కనెక్ట్ చేయొచ్చు. రిఫ్రిజిరేటర్ వాయిస్ ఫీచర్‌ని ఉపయోగించి ఎయిర్ కండీషనర్, లైట్లు లేదా ఇతర పరికరాలను కంట్రోల్ చేయొచ్చు.
(latest-telugu-news | telugu-news | fridge | tech-news | telugu tech news)