BSNL: కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్‌ ప్లాన్‌ చాలామంది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.1499తో ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
BSNL Recharge Plan

BSNL Recharge Plan

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్‌ ప్లాన్‌ చాలామంది యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రూ.1499తో ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు. ఇటీవల జియో, వీఐ, ఎయిర్‌టెల్ లాంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తమ టారిఫ్‌లను పెంచిన సంగతి తెలిసిందే. కానీ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ధరలను పెంచలేదు. ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో చూస్తే BSNL చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది.  

Also Read: లండన్‌ ఎయిర్‌ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం!

BSNL Rs. 1499 Plan

ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాలింగ్ ఉంటుంది. రోజుకు 100 SMSలు, మొత్తం 24 జీబీ డేటా వస్తుంది. అయితే ఈ ప్లాన్ డేటా అనేది ఎక్కువగా వాడేవారి కోసం కాకుండా ఎక్కువ కాలం సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వాళ్ల కోసం తీసుకొచ్చారు. లోకల్, ఎస్టీడీ, రోమింగ్ అన్ని కాల్స్‌ కూడా ఏడాది పాటు వాడుకోవచ్చు. 24 జీబీ డేటా పూర్తయిన తర్వాత డేటా వోచర్లను రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: ఇండియాలో ఏ రాష్ట్రం మంచిదో చెప్పిన సర్వే.. కేరళ ఫస్ట్, పంజాబ్‌ లాస్ట్

ఇంకా అదనపు గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలు కూడా పొందొచ్చు. Hardy Games,  BSNL Tunes,  Challenger, Gameium, Lystn Podcast, Arena Games, Gameson, , Zing Music, వంటి ఫ్రీగా ఉచితంగా లభిస్తాయి. అయితే ఈ రూ.1499 ప్లాన్‌ అనేది డేటా ఎక్కువగా వాడకుండా.. కాల్స్‌ కోసం ఎక్కువగా వాడే వాళ్లకి ప్రయోజనం ఉంటుంది.

Also Read: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 1000 మంది కార్మికులు!

Also Read :  మేడిగడ్డ కుంగుబాటులో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేస్

 

latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | business news telugu | latest technology news in telugu | data-balance

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు