AC OFFERS: ఇదెక్కడి ఆఫర్రా మావా.. సగం ధరకే చల్ల చల్లని ఏసీలు!

ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలపై కిర్రాక్ ఆఫర్లు ఉన్నాయి. వోల్టాస్ ఏసీ రూ.45,000కి, బ్లూ స్టార్ రూ.47,990కి, గోద్రెజ్ రూ.44,991కి, Haier రూ.47,990కి, LG రూ.55,490కి, వర్ల్‌పూల్ రూ.43,153కి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ భారీ తగ్గింపులతో లభిస్తున్నాయి.

New Update
best branded acs available on flipkart like voltas, blue star with huge discounts

best branded acs available on flipkart like voltas, blue star with huge discounts

వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. అందువల్ల భగభగమండే వేడిలో చల్ల చల్లని గాలి తాకితే ఆ కిక్కే వేరు. మరి మీరు కూడా అలాంటి ఫీలింగ్‌నే అనుభూతి పొందాలనుకుంటున్నారా?. అయితే ఇక్కడ భారీ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లతో కిర్రాక్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ అనేక పెద్ద బ్రాండ్‌ల ACలపై 40% వరకు భారీ తగ్గింపులు ఇస్తుంది. వోల్టాస్, LG, బ్లూ స్టార్, వర్ల్‌పూల్, హైయర్, గోద్రెజ్ వంటి బ్రాండ్‌లను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

వోల్టాస్ 2 టన్ స్ప్లిట్ ఏసీ

వోల్టాస్ 2 టన్ స్ప్లిట్ ఏసీ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ. 79,990 ఉండగా.. ఇప్పుడు 43% తగ్గింపు వస్తుంది. ఈ తగ్గింపుతో వోల్టాస్ ఏసీని కేవలం రూ.45,000కి సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా రూ.5,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీంతో మరింత తక్కువకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

బ్లూ స్టార్ 2 టన్ స్ప్లిట్ ఏసీ

బ్లూ స్టార్ 2 టన్ స్ప్లిట్ ఏసీ AC అసలు ధర రూ. 71,750గా కంపెనీ నిర్ణయించింది. కానీ దీనిని 33% తగ్గింపుతో కేవలం రూ. 47,990కి అందుబాటులో ఉంటుంది. బ్లూ స్టార్ ఎక్కువగా చల్లని గాలి, లైఫ్ టైమ్ కండీషన్‌కు బాగా ప్రసిద్ధి చెందింది. దీనిపై కూడా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

గోద్రెజ్ 2 టన్ స్ప్లిట్ ఏసీ

గోద్రెజ్ 2 టన్ స్ప్లిట్ ఏసీ 3-స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ 61,990గా ఉంది. కానీ ఇప్పుడు 27% తగ్గింపుతో ఇది కేవలం రూ. 44,991కి లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

Haier 2 టన్ కన్వర్టిబుల్ AC

Haier 2 టన్ కన్వర్టిబుల్ AC 7-ఇన్-1 మోడ్‌తో వస్తుంది. ఈ AC అసలు ధర రూ. 80,000గా కంపెనీ నిర్ణయించింది. కానీ ఇప్పుడు 40% తగ్గింపు వస్తుంది. ఈ తగ్గింపుతో ఈ ఏసీని కేవలం రూ.47,990కి లభిస్తుంది. అంటే సగం ధరకే కొనుక్కోవచ్చు. 

Also Read: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

LG 2 టన్ స్ప్లిట్ AC

LG 6-ఇన్-1 AC అసలు ధర రూ.95,990 కాగా.. ఇప్పుడు 42% తగ్గింపుతో కేవలం రూ.55,490కి అందుబాటులో ఉంది. 

వర్ల్‌పూల్ 2 టన్ స్ప్లిట్ AC

వర్ల్‌పూల్ AC అసలు ధర రూ.46,900 కాగా ఇప్పుడు 7% తగ్గింపుతో రూ.43,153 లకే కొనుక్కోవచ్చు. అలాగే BOBCARD కొనుగోలుపై అదనంగా 10% తగ్గింపును కూడా పొందుతారు. 

 

AC OFFERS | telugu tech news | latest-telugu-news | telugu-news | latest technology news in telugu | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Airtel Cheapest Recharge Plan: ఐపీఎల్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.451కే మూడు నెలల వ్యాలిడిటీ!

ఐపీఎల్ ప్రియుల కోసం ఎయిర్‌టెల్ డేటా ఓచర్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.451తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. 50GB డేటా పొందొచ్చు. మూడు నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. క్రికెట్ అభిమానులకు ఇదొక మంచి ప్లాన్ అని చెప్పొచ్చు.

New Update
Airtel new recharge plan offers Rs 10 per day free calls and 2GB daily data

Airtel Cheapest Recharge Plan

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) 2025 అత్యంత రసవత్తరంగా కొనసాగుతోంది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటా పోటీమీద ఆడుతున్నాయి. టైటిల్ సొంతం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లు చూసేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. కానీ గతంలో మాదిరిగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూసే వెసులుబాటు లేదు. జియోహాట్ స్టార్ గా ఏర్పడిన తర్వాత డబ్బులు చెల్లించి మ్యాచ్‌లు చూడాల్సి వస్తుంది. 

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

దీంతో ప్రముఖ టెలికాం కంపెనీలు తక్కువ ధరలో సబ్ స్కిప్షన్ ప్లాన్‌లను అందించి క్రికెట్ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అధిక వాలిడిటీని కూడా అందిస్తున్నాయి. ఇప్పటికే జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు తక్కువ ధరలో జియో హాట్ స్టార్ సబ్ స్కిప్షన్ ప్లాన్‌లను ప్రకటించాయి. తాజాగా ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు, క్రికెట్ ప్రియులకు కిక్కిచే ఆఫర్ అందించింది. 

Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

కేవలం రూ. 451 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో JioHotstarకి యాక్సెస్‌ను అందించడమే కాకుండా భారీగా డేటా కూడా వస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఇది కేవలం డేటా వోచర్ ప్లాన్. ఇందులో ఎలాంటి కాల్స్, మెసేజ్ ప్రయోజనాలు ఉండవు. ఈ వోచర్ పొందాలంటే వినియోగదారులు యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ప్లాన్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. 

Also read :  Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

రూ.451 రీఛార్జ్ ప్లాన్

ఈ రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది వినియోగదారులకు 50GB డేటాను అందిస్తుంది. దీంతోపాటు మూడు నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగాను ఐపిఎల్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని ఎయిర్‌టెల్ తీసుకువచ్చింది. 

కాగా గతంలో కంపెనీ రూ. 100, రూ. 195 ధరలతో మరో రెండు డేటా వోచర్‌లను ప్రారంభించింది. అందులో రూ.100 ప్లాన్ 30 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5GB డేటాను అందిస్తుంది. అలాగే రూ.195 ప్లాన్ 15GB డేటా, మూడు నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. 

ఇక జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు సర్వీస్ వాలిడిటీని కలిపే రీఛార్జ్‌లు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ రూ.3999, రూ.549, రూ.1029, రూ.398 ధరలకు అనేక ప్లాన్‌లను అందుబాటులో ఉంచింది.

airtel | airtel-ott-offers | airtel-recharge-plan | airtel-new-recharge-plans | airtel-free-offers | latest-telugu-news | telugu-news | IPL 2025

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు