Gautami: గౌతమిని చంపుతానని బెదిరిస్తున్న తమిళనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి

సీనియర్ నటి గౌతమికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన భూమిని కబ్జా చేయడమే కాకుండా ఇప్పుడు గౌతమిని, ఆమె కూతురిని కూడా చంపేస్తామని చెదిరిస్తున్నారు.

New Update
Gautami: గౌతమిని చంపుతానని బెదిరిస్తున్న తమిళనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి

Death threat to Actress Gautami: గౌతమి....ఈమె తెలియని ఎవరూ ఉండరు. ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా వెలుగొందిన ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. తాజాగా ఆమె గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి.. తనకు చెందిన విలువైన భూమిని కబ్జాకు గురైనట్లుగా ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ పని చేసిన తమిళనాడు ల్యాండ్ మాఫియా గౌతమిని, ఆమె కూతురిని కూడా చంపుతామని చెదిరిస్తున్నారు.

గౌతమికి చెందిన రూ.25 కోట్లు విలువైన భూమి కబ్జాకు గురైంది. శ్రీ పెరంబదూర్ తో పాటూ తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఆమెకు స్థలాలు ఉన్నాయి. గౌతమి క్యాన్సర్ బారిన పడినప్పుడు వాటిని అమ్మాలనుకున్నారు. దానికోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి అళగప్పన్ ను సంప్రదించారు. అప్పుడు జరిగిన లావాదేవీల్లో గౌతమి స్థలాల దస్తావేజుల మీద అళగప్పన్ ఫోర్జరీ సంతకాలు చేసి తన పేరుతో పకిలీ డాక్యుమెంట్లను సష్టించుకున్నాడు. దీని గురించి తెలిసిన గౌతమి అతనిని నిలదీయగా చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. తన వెనుక బోలెడంత రాజకీయ బలముందని, ఆ భూములను తకే వదిలేయాలని అళగప్పన్ బెదిరిస్తున్నారు.

దీంతో గౌతమి చెన్నై పోలీసులను ఆశ్రయించారు. సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. నటి గౌతమి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

తెలుగు అమ్మాయి అయిన గౌతమి తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. మొదటి భర్త సందీప్ భాటియాతో విడిపోయిన తర్వాత కమల్ హసన్ తో కొంత కాలం ఉండి తర్వాత అతనితో కూడా విడిపోయింది.

Also Read: ఈ హీరోయిన్ ఇక టాలీవుడ్‌కు దూరం.. కొత్త ఆఫర్‌లను తిరస్కరిస్తోన్న లేడీ సూపర్‌స్టార్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

మెగా ఫ్యాన్స్ కు రేపు నిజంగానే పండుగ రోజు. అసలే రేపు శ్రీరామ నవమి...దానికి తోడు చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ ను ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ గ్లింప్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

New Update
peddi ram charan look

peddi ram charan look

గేమ్ ఛేంజర్ తర్వాత అందరూ ఆసక్తి చూస్తున్న రామ్ చరణ్ సినిమా పెద్ది. ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై హైప్స్ పెంచేసిన మూవీ దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తానంటూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ దీని కోసం ఆతృతగా ఎదురు చేస్తున్నారు. 

పెద్ది గ్లింప్స్ పై క్రేజీ పోస్ట్ లు..

టైటిల్ ఎంత క్రేజీగా ఉందో ఇందులో చరణ్ లుక్ కూడా అంతే క్రేజీగా చాలా మాస్ అండ్ రస్టిక్ ఉంది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో చరణ్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. 'ఉప్పెన' తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఈ కథను సిద్ధం చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పుడు గ్లింప్స్ శ్రీరామ నవమి రోజు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పెద్ది' మూవీ గ్లింప్స్ ని ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. రేపు (ఏప్రిల్ 6) ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. దీనిపై తాజాగా రామ్ చరణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  గ్లింప్స్ చూసిన తర్వాత సూపర్ ఉత్సాహంగా ఉంది. ఇది మీకు కూడా చాలా నచ్చుతుంది అంటూ అందులో రాశారు. ఈ సందర్భంగా ఓ వీడియోని కూడా షేర్ చేసారు. దీనిపై బుచ్చిబాబు రియాక్ట్ అవుతూ ఏఆర్ రెహమాన్, చరణ్ అదరగొట్టారనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు.

 

 today-latest-news-in-telugu 

 Also Read: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment