Ponnala Laxmaiah: మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ..పండగకి ఊరెళ్లిన సమయంలో
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్షన్నర నగదు, ఆభరణాలు దోపిడీకి గురైనట్టు తెలుస్తోంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్షన్నర నగదు, ఆభరణాలు దోపిడీకి గురైనట్టు తెలుస్తోంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మావోయిస్టుల బెదిరింపు లేఖపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో అనిరుధ్ రెడ్డితో పాటు ఉండి.. తర్వాత BRSలో చేరిన షేక్ రఫీక్ ఈ లేఖను రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కారు రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పాను కానీ అవినీతి జరగలేదని తానెక్కడా అనలేదని చెప్పుకొచ్చారు. కేటీఆర్ కు తానేం క్లీన్ చీట్ ఇవ్వలేదని తెలిపారు దానం నాగేందర్.
మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కారు రేసులో నేడు ఏసీబీ విచారణకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి కష్టపడి ఈ ఫార్ములా కారు రేస్‌ను తీసుకొచ్చామన్నారు. ఎప్పటికైనా సత్యమే, న్యాయమే గెలుస్తుందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేసింది. కానీ బీసీ రిజర్వేషన్ల ఆంశం, పంచాయతీ రాజ్ చట్టంలోని మార్పల వలన మరింత ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తోంది.
ప్రపంచ తెలుగు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మర్చిపోవడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీని వెనుక ఓ కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. యాంకర్ కు చదువురాదా? అని ప్రశ్నించారు.
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. మన్మోహన్ సింగ్ చేసిన విశిష్ట సేవలు గురించి సభలో సీఎం ప్రస్తావించారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ తెలిపారు.