/rtv/media/media_files/2025/01/06/WV4Y9R7SWbVTKweyFIo7.jpg)
ktr
ఈ ఫార్ములా కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. నేడు కేటీఆర్ ఏసీబీ (ACB) విచారణకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించడంతో పాటు తెలంగాణకు గుర్తింపు తీసుకురావడానికి ఫార్ములా ఈ-రేసును ఎంతో కష్టపడి తీసుకొచ్చామన్నారు. చలనశీలతకు హైదరాబాద్‌ను కీలక కేంద్రంగా మార్చడమే ఎజెండాగా ఫార్ములా రేసును తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు.
ఇది కూడా చూడండి: Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!
Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globally
— KTR (@KTRBRS) January 9, 2025
Agenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise… pic.twitter.com/JhqimVe9TI
ఇది కూడా చూడండి: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్
తెలంగాణ ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటారు..
ఉపాధి, ఆదాయాన్ని సృష్టించే ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ, పరిశోధన, తయారీలో ఉపాధి అవకాశాలు కల్పించాలని పెట్టుకున్నామన్నారు. ఈ ఫార్ములా కారు రేసు వల్ల రూ.12,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామన్నారు. చిన్న మనస్తత్వం ఉన్నవారికి ఇలాంటివి అర్థం కావన్నారు. తెలంగాణ ప్రజలు సత్యాన్ని తప్పకుండా అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నానని కేటీఆర్ తెలిపారు. ఎప్పటికైనా సత్యమే, న్యాయమే గెలుస్తుందన్నారు.
ఇది కూడా చూడండి: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి