KTR అవినీతి చేయలేదని చెప్పలేదే..  ఎమ్మెల్యే  దానం యూటర్న్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కారు రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పాను కానీ అవినీతి జరగలేదని తానెక్కడా అనలేదని చెప్పుకొచ్చారు.  కేటీఆర్ కు తానేం క్లీన్ చీట్ ఇవ్వలేదని తెలిపారు దానం నాగేందర్.

New Update
danam ktr

danam ktr Photograph: (danam ktr)

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కారు రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పాను కానీ అవినీతి జరగలేదని తానెక్కడా అనలేదని చెప్పుకొచ్చారు.  కేటీఆర్ (KTR) కు తానేం క్లీన్ చీట్ ఇవ్వలేదని తెలిపారు.  కేటీఆర్ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి తాను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని చెప్పుకొచ్చారు.

హైడ్రా వల్ల పార్టీకి నష్టం

మీడియాతో ఆదివారం చీట్ చాట్ చేసిన దానం..  హైడ్రాపై తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉంటానని చెప్పారు.  దీనిపై ప్రభుత్వం పునారలోచన చేసుకోవాలని సూచించారు.  హైడ్రాపై  తన మాటలను కొందరు వక్రీకరించారనని దానం తెలిపారు.  హైడ్రా వల్ల పార్టీకి నష్టం జరిగిందని చెప్పారు. ఇప్పుడు తాను ఏం  మాట్లాడిన సంచలనమే అవుతుందని దానం నవ్వూతూ చెప్పుకొచ్చారు.  

ఇక తాను ఫైటర్ నని..  ఖైరతాబాద్ లో  ఉప ఎన్నిక వస్తే భయపడనని తెలిపారు. ఇక  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు  ఎమ్మెల్యే దానం నాగేందర్.  ఈ విషయంలో కార్యకర్తలు చురుగ్గా పనిచేయడం లేదని మండిపడ్డారు.  రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎం రేవంత్‌రెడ్డికి కార్యకర్తలు పాలాభిషేకం చేయాలని దానం పిలుపునిచ్చారు.

మూసీపై బీజేపీ నేతలు ఒక్క రోజు నిద్ర చేశారని..   మూసీ నిద్రకు ముందే నిర్వాసితుల ఇళ్లలో ఏసీలు పెట్టించుకుని వెళ్లారని ఆరోపించారు.   నిర్వాసితుల ఇళ్లలో కాకుండా.. బయట నుంచి తెచ్చిన టిఫిన్‌ కిషన్‌రెడ్డి తిన్నారన్నారు.  కంటితుడుపుగా బీజేపీ నేతలు మూసీ నిద్ర సాగిందని తెలిపారు దానం.  

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దానం చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.   కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా దానం చేసిన కామెంట్స్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  ఫార్ములా ఈ రేసు వల్ల అవినీతి జరిగిందో లేదో కానీ హైదరాబాద్  బ్రాండ్ మాత్రం బాగా పెరిగిదంటూ కామెంట్ చేశారు.  అలాగే  కేసీఆర్ భోళా శంకరుడని, గొప్ప నేత అంటూ ప్రశంసించారు.  కేసీఆర్ తెచ్చిన పథకాలు గొప్పగా ఉన్నాయంటూ కితాబు ఇచ్చారు దానం. ఇక హైడ్రా వల్ల  పార్టీపై ప్రజలకు నమ్మకం లేదని చెప్పుకొచ్చారు.  అయితే దానం చేసిన కామెంట్స్ పై  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.  దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

Also Read :  పంత్ అలా చేస్తే నా పేరు మార్చుకుంటా.. అశ్విన్ సవాల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. దీనికి సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. 

New Update
ts

BRS

ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.

 

today-latest-news-in-telugu | brs-party | meeting | warangal 

 

Also Read: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..

Advertisment
Advertisment
Advertisment