Manmohan Singh కు భారత రత్న ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ మృతి చెందడంతో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. మన్మోహన్ సింగ్ చేసిన విశిష్ట సేవలు గురించి సభలో సీఎం ప్రస్తావించారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ తెలిపారు.

New Update
CM Revanth Reddy

Revanth Reddy cm Photograph: (Revanth Reddy cm)

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో సమావేశంలో రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి.. అతను చేసిన సేవలను గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా, డిప్యూటీ ఛైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా వివిధ హోదాల్లో దేశానికి ఆయన విశిష్ట సేవలు అందించారన్నారు. 

ఇది కూడా చూడండి: Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి

ఇది కూడా చూడండి: Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?

నీతి, నిజాయితీకి మారుపేరు..

ఆర్థిక రంగంలో మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారని రేవంత్ అన్నారు. ఆర్టీఐ, ఉపాధి, ఆధార్ వంటి ఎన్నో సంస్కరణలను మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారని, నిజాయితీ విషయంలో ప్రస్తుతం ఎవరూ పోటీ పడే వారు లేరన్నారు. 60 ఏళ్ల తెలంగాణ కల మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ తీసుకొచ్చిన ఎల్‌పీజీ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాయని సీఎం రేవంత్ అన్నారు. 

ఇది కూడా చూడండి: Rohith Sharma: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

నిరుపేదలకు 2013లో భూ సేకరణ చట్టం తీసుకొచ్చి వారికి న్యాయం జరిగేలా చేశారని, ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్‌ సింగ్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. 

ఇది కూడా చూడండి:  Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు