/rtv/media/media_files/2025/01/11/BDoiB89tEFpl5VbVjjvD.jpg)
Maoists warning to congress mla anirudh reddy
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) ని బెదిరిస్తూ మావోయిస్టు (Maoists) ల పేరిట ఓ లేఖ ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు లేఖ రాసింది మావోయిస్టులు కాదని పోలీసులు తేల్చారు. గతంలో ఎమ్మెల్యే వద్ద పని చేసిన వ్యక్తే ఈ లేఖ రాసినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించాలనే కుట్రతోనే లేఖ రాసినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన షేక్ రఫీక్ అనే వ్యక్తి గత ఎన్నికలకు ముందు అనిరుధ్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. అయితే.. ఆయన వెంట ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదంటూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇది కూడా చదవండి: Telangana Accident: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం!
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ముగ్గురు అరెస్ట్ A1 షేక్ రఫీతో పాటు కుమ్మరి భగవంతు, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి వెల్లడి గతంలో ఎమ్మెల్యే అనిరుధ్ వద్ద పనిచేసిన షేక్ రఫీ ఆ తర్వాత బయటకు వచ్చి ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్లు… pic.twitter.com/rFA8sN0NoI
— Telangana Beat (@TelanganaBeats) January 16, 2025
Also Read : ఎమ్మెల్యే అనిరుధ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
అనిరుధ్ గెలుపుతో కక్ష్య
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన అనిరుధ్ ను ఓడించడమే లక్ష్యంగా పని చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో అనురుధ్ రెడ్డి విజయం సాధించడంతో ఆయన జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఎలాగైనా ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం కలిగించాలని కుట్ర పన్నాడు. గ్రామానికి చెందిన షా అలీ, కుమ్మరి హన్మంతు, షేక్ తౌఫిక్ తో కలిసి మావోయిస్టుల పేరుతో లెటర్ ప్యాడ్ తయారు చేయించారు. షేకర్ రఫిక్ కు పరిచయం ఉన్న ప్రింట్ ప్రెస్ వారితోనే ఈ లెటర్ ప్యాడ్ ముంద్రించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం ఆ లెటర్ ప్యాడ్ పై లచ్చన్నదళం పేరిట ఎమ్మెల్యేను బెదిరిస్తూ ప్రకటన రాశారు.
ఇది కూడా చదవండి: BREAKING: దానం నాగేందర్‌కు మంత్రి పదవి.. సీఎం రేవంత్ సంచలన వ్యూహం ఇదే!
ఆ లేఖను షేక్ తౌఫిక్ గ్రామంలో అతికించారు. ఈ నెల 9న విషయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. గ్రామానికి చెందిన కోమటి రవికుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన షేక్ రఫిక్ పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆ లేఖను తానే రాసినట్లు రఫిక్ అంగీకరించినట్లు ఎస్పీ జానకి నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేయగా.. షేక్ తౌఫిక్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Also Read : టార్గెట్ సైఫా లేక పిల్లలా? .. సీసీ టీవీ ఫుటేజ్‌లో కీలక విషయాలు!