CM Revanth: సీఎం పేరు మర్చిపోవడం కుట్ర.. వాడేం యాంకర్: ఎంపీ చామల సీరియస్ రియాక్షన్

ప్రపంచ తెలుగు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మర్చిపోవడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీని వెనుక ఓ కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. యాంకర్ కు చదువురాదా? అని ప్రశ్నించారు.

New Update
Revanth Reddy Chamala Kiran Kumar Reddy

Revanth Reddy Chamala Kiran Kumar Reddy

ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో యాంకర్ సీఎం రేవంత్ రెడ్డి పేరును మరిచిపోయిన విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం పేరు మర్చిపోవడంపై ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. సీఎం పాపులారిటీకి ఇది నిదర్శనమంటూ ట్రోల్ చేస్తున్నారు.

Also Read :  తెలంగాణలో బస్ ఛార్జీలు పెంపు.. RTV ఇంటర్వ్యూలో మంత్రి పొన్నం క్లారిటీ!

బుద్ధి లేదా?

అయితే.. ఈ అంశంపై కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా? అంటూ ఫైర్ అయ్యారు. యాంకర్ కు చదువు రాదా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తెలియని వాళ్లు యాంకర్ కూడా అవుతారా? అంటూ ప్రశ్నించారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. 

అసలేమైందంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరో హీరో  మరిచిపోవడం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.  హైదరాబాద్‌ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ఆదివారం (జనవరి 05)  సీఎం  రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే దీనికి హోస్ట్ గా వ్యవహరించిన హీరో బాలాదిత్య సీఎంకు స్వాగతం పలికే సందర్బంలో మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్‌ కుమార్‌ గారు అంటూ ఉచ్ఛరించాడు.

Also Read :  తెలంగాణలో కల్లు, మటన్ ఉంటే చాలు.. దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు!

దీంతో సభలో కిందున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. వెంటనే తప్పు తెలుసుకున్న  బాలాదిత్య క్షమించాలి  సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉచ్ఛరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో  బాలాదిత్య తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.  ఒక రాష్ట్ర సీఎం పేరును ఎలా మర్చిపోతారంటూ ఫైరవుతున్నారు. 

Also Read :  ఊపందుకున్న స్టాక్ మార్కెట్.. పెరిగిన Ongc షేర్ ధరలు

Also Read :  కేటీఆర్‌కు బిగ్ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు