TS: ఉద్యోగులకు డబుల్ డీఏ..తెలంగాణ కేబినెట్ నిర్ణయం
నిన్న సుదీర్ఘంగా ఐదు గంటలపాటూ తెలంగాణ కేబినెట్ మీటింగ్ సాగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని డిసైడ్ అయింది.
నిన్న సుదీర్ఘంగా ఐదు గంటలపాటూ తెలంగాణ కేబినెట్ మీటింగ్ సాగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని డిసైడ్ అయింది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతిలు ఆదివారం కలిశారు. బీసీ కోటాలో విజయశాంతి మంత్రి పదవి ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. కేబినెట్లో తనకు చోటు కల్పించాలని అద్దంకి దయాకర్ కూడా కోరినట్లు తెలుస్తోంది.
హోంశాఖ అంటే తనకు ఇష్టమని అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనకు హోంశాఖ అయితే బాగుంటుందని తన అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లుగా మీడియాతో చెప్పాను అంతే కానీ తనకు హోంశాఖ కావాలని కోరలేదన్నారు.
రేవంత్ సర్కార్ ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలకు చోటు కల్పించే యోచనలో అదిష్ఠానం ఉన్నట్లు సమాచారం. రెడ్డి లేదా రావు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కొత్తగా గ్రామ పాలనా అధికారులు కొలువుదీరనున్నారు. ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గం కొత్తగా 10వేల 950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తరెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేసింది.
బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు నడుస్తోన్న నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని ఇందులో డిప్యూటీ సీఎం పదవిని పొన్నంకు దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో ముగ్గురి మంత్రుల పదవులు ఊడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూపల్లి కృష్ణరావు, కొండా సురేఖతోపాటు మరో మంత్రిని కేబినెట్ నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కేబినెట్ ఏర్పాటుకు ఢిల్లీ పెద్దలు ఒకే చెప్పారట.