TG GPO jobs: ఉద్యోగాల జాతర.. 10వేల GPO పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో కొత్తగా గ్రామ పాలనా అధికారులు కొలువుదీరనున్నారు. ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గం కొత్తగా 10వేల 950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తరెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేసింది.

author-image
By K Mohan
New Update
telangana cabinet 000

telangana cabinet 000 Photograph: (telangana cabinet 000)

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా గ్రామ పాలనా అధికారులు కొలువుదీరనున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ వలే వారి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోనున్నారు. ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గం కొత్తగా 10వేల 950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తరెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేసింది. 10 జిల్లాల కోర్టులకు 55 పోస్టులు మంజూరుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

Also read: Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు విడుదల!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (మార్చి 6) కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 6 గంటలపాటు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 12నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ అసెంబ్లీ సమావేశంలో గ్రామ పాలన అధికారుల నియామకం విధివిధాలు, నోటిఫికేషన్ సంబంధించిన విషయాలపై క్లారిటీ రానుంది. 

Also Read: TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment