తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు!
రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ, కుల సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేను 60రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో18 జారీ చేశారు.
మొగులయ్యకు అన్యాయం.. ప్రభుత్వం ఇచ్చిన 15 రోజులకే ధ్వంసం!
పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన 600 గజాల స్థలంలో ఇటీవల కాంపౌండ్ వాల్‌ను నిర్మించుకున్నాడు. ఆ వాల్‌ను గుర్తు తెలియని దుండగులు రాత్రి ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణకు మళ్లీ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్
గతంలో తెలంగాణ క్యాడర్లో విధులు నిర్వర్తించి డిప్యూటేషన్ మీద కేంద్రంలో విధులు నిర్వర్తించడానికి వెళ్లిన ఐపీఎస్ అకున్ సబర్వాల్ మళ్లీ రాబోతున్నారు. డ్రగ్స్ ఫీ స్టేట్‌గా మార్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్ మీద తీసుకురానున్నట్లు సమాచాారం.
కొండా సురేఖ మంత్రి పదవి ఔట్.. TPCC చీఫ్ క్లారిటీ!
నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి పదవి నుంచి కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్టానం తొలిగిస్తుందనే దానిపై టీపీసీసీ చీఫ్ మహేష్ క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం ఎటువంటి వివరణ తమను కోరలేదని చెప్పారు.
అమ్మకానికి సీఎం రేవంత్ ఫొటో.. ఎందుకో తెలుసా?
TG: సీఎం రేవంత్ రెడ్డి ఫొటో అమ్మకానికి పెట్టడం చర్చకు దారి తీసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటో పెట్టాలని ప్రభుత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫొటోకు రూ.1600 చెల్లించాలని పంచాయతీ కార్యదర్శుల వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది.
తెలంగాణలో సక్సెస్.. హర్యానాలో ఫెయిల్.. కాంగ్రెస్ చేసిన బిగ్ మిస్టేక్ అదే!
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలంగాణలో అగ్రనేతలందరినీ ఒకే తాటిపై నడిపించిన హస్తం పార్టీ.. హర్యానాలో మాత్రం విఫలమైందన్న టాక్ నడుస్తోంది. దీంతో గెలిచే అవకాశం ఉన్నా.. అధికారానికి దూరమైందన్న చర్చ సాగుతోంది.
/rtv/media/media_files/Es5IlpXhM2QrgCI55P3C.jpg)
/rtv/media/media_files/MzkgD7lQvkifaAfVcp3q.jpeg)
/rtv/media/media_files/I9qzQeD9jhBCD33OXOLE.jpg)
/rtv/media/media_files/XDMhKw2kPIZ3L9xoZRPl.jpg)
/rtv/media/media_files/sn5iBmUHg7y8QFfzGdeu.jpeg)
/rtv/media/media_files/HppAzRQhCFOsq0Z3Te3W.jpg)